దానయ్య కుటుంబాన్ని విడిచి.. సీదిరికి పరామర్శా?
ABN , Publish Date - Jul 30 , 2026 | 01:11 AM
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లా జైలుకు వచ్చి మాజీమంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించను న్నారు.
బాధిత యాదవ కుటుంబమంటే వైసీపీకి చిన్నచూపా?
ఇప్పటికే మండిపడుతున్న యాదవ సంఘాలు
తొలి నుంచి అప్పలరాజును వెనకేసుకొస్తున్న వైసీపీ
చిన్నపిల్లాడు అంటూ జగన్ కితాబు.. నేడు ములాఖత్
తమ్మినేని కుటుంబం బాధితులను పరామర్శించరా?
వైసీపీ అధినేత జగన్‌కు జిల్లా వాసుల ప్రశ్నలు
శ్రీకాకుళం, జూలై 29(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లా జైలుకు వచ్చి మాజీమంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించను న్నారు. సీదిరి అప్పలరాజు కుమారు డు ఆరవ్ వర్మ ఈ నెల 10వ తేదీన బైక్ నడుపుతూ దుబ్బ దానయ్యను ఢీకొట్టి అతని మృతికి కారణమయ్యా డు. అప్పలరాజు కుమారుడ్ని తప్పిం చేందుకు పన్నాగం పన్ని.. తన అను చరుడైన సిద్ధార్థ త్యాడిని పురమాయించి.. ఈ ప్రమాదం అతనే చేసినట్లు పోలీసులకు చెప్పిం చారు. పోలీసులు కూడా నమ్మేశారు. తర్వాత విషయం ‘ఆంధ్రజ్యోతి’ ద్వారా వెలుగులోకి వ చ్చింది. అప్పటికే సాంకేతిక వివరాలు.. ఆధారా లు సైతం పోలీసుల చేతికి చిక్కాయి. దానయ్య ను ఢీకొట్టి అతని మృతికి కారణం ఆరవ్ వర్మ అని, అప్పలరాజు స్కెచ్ వల్లనే తప్పుడు వివ రాలు నమోదు అయ్యాయని.. అప్పలరాజుపై కూడా కేసు నమోదైంది.
దానయ్య కుటుంబాన్ని విడిచి..
సీదిరి అప్పలరాజు కుమారు డు ఆరవ్‌వర్మ వల్ల ని రుపేద గొర్రెలకాపరి దుబ్బ దానయ్య కుటుం బం వీధినపడింది. ప్ర మాద ఘటన నుంచి తప్పించుకునేందుకు కొంతమందిని రంగంలోకి దింపి.. డబ్బులు ఇస్తామని, దానయ్య భార్యను ఇంటిలో పనిమనిషిగా ఉంచుతామని మభ్యపెట్టేయత్నం చేశారు. వాస్తవం గ్రహించాక పోలీసులు కేసుపెట్టాక.. వైసీపీ నాయకులు మొత్తం సైలెంట్ అయ్యారు. దుబ్బ దానయ్యను వైసీపీ నాయకులు, కార్యకర్తలు పట్టించుకోలేదు. పైగా సీదిరి అప్పలరాజుకు అన్యాయం జరిగిందంటూ పరామర్శల యాత్రలు చేపట్టారు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి కూడా సీదిరి అప్పలరాజును పరామర్శించడం గమనార్హం. వాస్తవంగా బాధిత కుటుంబమైన దానయ్య కుటుంబ సభ్యులకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి భరోసా ఇవ్వకుండా సీదిరిని పరామర్శించడంతో యాదవ సంఘాల నాయకులు, సాధారణ ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
చిన్నపిల్లాడు .. తప్పుచేశాడని నిర్ధారించేసిన జగన్...
పోలీసుల ప్రాథమిక విచారణలో అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకునేటప్పుడు కూడా వాస్తవాన్ని అప్పలరాజే అంగీకరించారు. అయితే ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ సంతకం చేయలేదు. ఈవిషయాన్ని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించారు. ఇదిలా ఉంచితే.. ఇటీవల విశాఖపట్నం జిల్లాలో పరామర్శకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి అక్కడ మాట్లాడుతూ.. సీదిరి అప్పలరాజు కుమారుడు చిన్నపిల్లాడని.. 18 ఏళ్లని.. తెలిసోతెలియక ప్రమాదం చేశాడని.. ఒకరు మరణించారని.. ఇలా సీదిరి అప్పలరాజు కుమారుడు పాత్ర స్పష్టంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఘటనలో అప్పలరాజుపై కూడా కఠిన కేసులు నమోదు చేయడమేంటన్నారు. అయితే వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అప్పలరాజు సైతం.. బైక్ ప్రమాదాన్ని సిద్ధార్థ త్యాడి చేశాడని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికపైనా ఇదే చెబుతున్నారు. మరి జగన్ స్వయంగా చిన్నపిల్లాడు తప్పుచేశాడని నిర్ధారించి చెప్పడం నేరం ఒప్పుకున్నట్లే కదా అన్న చర్చ సాగుతోంది.
తమ్మినేని బాధితులను పరామర్శించరా...?
మాజీ స్పీకర్ తమ్మినేని కుటుంబం అక్రమాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. బాధితులు నేరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం రూరల్ మండలంలో కేసు నమోదైంది. బతికున్న వ్యక్తిని కాగితాల్లో చంపేసి ధ్రువపత్రాలు సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తమ్మినేని కుటుంబంపై కేసు నమోదైంది. ఈ విషయంలో బాధిత కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారా..? అని జిల్లా ప్రజల నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ తన తల్లిని బెదిరించి.. తమ స్థలాన్ని మరొకరికి రిజిస్ట్రేషన్ చేయించి.. వెనువెంటనే ఆమె పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. భోగి సంతోష్ పవన్ మణికంఠ, భోగి సుధారాణి కొద్దిరోజుల క్రితం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి వీరి విషయంలో జగన్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారన్న ప్రశ్న వ్యక్తమవుతోంది.
ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు?
బాధితులను కాకుండా నిందితులకు పరామర్శా?
దానయ్య కుటుంబానికి న్యాయం చేయాలి
ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలి
యాదవ సంఘం నాయకుల డిమాండ్
కాశీబుగ్గ, జూలై 29(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని యాదవ సంఘం నాయకులు ధ్వజమెత్తారు. బాధితులను కాకుండా నిందితులను పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు. బుధవారం వారు కాశీబుగ్గలో విలేకరులతో మాట్లాడారు. హిట్ అండ్ రన్ ఘటనలో మృతి చెందిన గొర్రెల కాపరి దానయ్య కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి, యాదవ సంఘం నాయకుడు లొడగల కామేశ్వరరావు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం ఆనంతరం దర్యాప్తు తీరు బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా లేదన్నారు. దానయ్య కుటుంబానికి ఇప్పటికీ పూర్తిస్ధాయి న్యాయం అందలేదన్నారు. ఘటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై అనేక సందేహలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసేలా సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
దానయ్య ఇంటికి వెళ్లండి..
మాజీ ముఖ్యమంత్రి వైఎప్ జగన్ పలాసకు వస్తున్నారన్న సమాచారంతో యాదవ సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానయ్య కుటుంబాన్ని కూడా పరామర్శించరా? అని ప్రశ్నించారు. దానయ్య కుటుంబం కోసం ఎంతమంది వైసీపీ నాయకులు మాట్లాడారని, ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని అన్నారు. మంత్రి కొలుసు పార్ధసారధి, పలువురు ప్రజా ప్రతినిధులు, యాదవ సంఘం నాయకులు దానయ్య కుటుంబానికి అండగా నిలిచారని గుర్తు చేశారు. దానయ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. టీడీపీ పట్టణ కార్యదర్శి సప్ప నవీన్, యాదవ సంఘం నాయకులు అంబటి క్రిష్ణమూర్తి, కొరికాన శంకర్, దాసరి దాశరధి, దశరథ, కొండే నర్సింహులు, భుజంగరావు, చిట్టిబాబు, తిరుపతి, చిన్నారావు, అప్పారావు, బద్రి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.