Share News

‘బ్రహ్మకుమారీస్‌’కు స్థలం లీజు కొనసాగింపు

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:18 AM

శ్రీకాకుళం నగరంలోని ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వ విద్యాలయానికి (శ్రీకాకుళం బ్రాంచ్‌) మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్థలాన్ని లీజును కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది.

‘బ్రహ్మకుమారీస్‌’కు స్థలం లీజు కొనసాగింపు

శ్రీకాకుళం, జూలై 24(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలోని ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వ విద్యాలయానికి (శ్రీకాకుళం బ్రాంచ్‌) మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్థలాన్ని లీజును కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. ఎల్‌పి నంబర్‌ 38/82-ఏ లో ఉన్న 333.3 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని బ్రహ్మకుమారీస్‌ విశ్వవిద్యాలయానికి గతంలో ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. ఈ లీజు గడువు తీరిపోవడం తో తదుపరి చర్యలపై మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌, డైరెక్టర్‌, శ్రీకాకుళం కమిషనర్‌ 2026 జూలై 1న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదికలను పరిశీలించిన ప్రభుత్వం.. 1965 ఆంధ్రప్రదేశ్‌ మున్సి పాలి టీస్‌ చట్టానికి తగిన సవరణలు చేసే వరకు ఈ స్థలం లీజును కేవలం మధ్యంతర ఏర్పాటుగా మాత్రమే కొనసాగించేందుకు అంగీకరించింది. అయితే 2026 మే 1న ప్రభుత్వం విడుదల చేసిన జీవో 92 ఉత్తర్వుల ప్రకారం నిర్ణీత లీజు అద్దెను చెల్లించాల్సి ఉంటుందని ఈ ఉత ్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ జీవోఆర్టీ 970 జారీ చేశారు.

కఠిన షరతులతోనే అనుమతి..

లీజు కొనసాగింపునకు సంబంధించి పలు షరతులు విధించింది. సంస్థ క్రమం తప్పకుండా నిర్ణీత లీజు అద్దెను చెల్లించాలని, స్థలానికి వర్తించే అన్ని రకాల పన్నులు, ఇతర చట్టబద్ధమైన బకాయిలను కచ్చి తంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ అనుమతి పూర్తిగా తా త్కాలికమేనని, ఈ మున్సిపల్‌ ఆస్తిపై బ్రహ్మకుమారీస్‌ సంస్థకు ఎలాంటి యాజమాన్య హక్కులు, శాశ్వత లీజు హక్కులు, పునరుద్ధరణ లేదా ఇత రులకు బదలాయించే హక్కు ఉండదని స్పష్టం చేశారు. ప్రజా ప్రయో జనాల దృష్ట్యా ఈ లీజు అనుమతిని ఎప్పుడైనా సవరించే లేదా రద్దు చేసే పూర్తి హక్కు ప్రభుత్వానికి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 12:18 AM