అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించాలి
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:54 PM
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాన్ని పెం పొందించాలని స్కూల్ ఎడ్యుకేషన్ జోన్-1 ప్రాంతీయ సంయుక్త సహాయ సంచాల కుడు(ఆర్‌జేడీ) బి.విజయభాస్కర్ తెలిపారు.
పాతపట్నం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాన్ని పెం పొందించాలని స్కూల్ ఎడ్యుకేషన్ జోన్-1 ప్రాంతీయ సంయుక్త సహాయ సంచాల కుడు(ఆర్‌జేడీ) బి.విజయభాస్కర్ తెలిపారు. గురువారం పాతపట్నం పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్‌లో తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల క్లాస్ వర్క్, హోంవర్క్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభి వృద్ధే లక్ష్యం కావాలన్నారు. ఆరోతరగతి నుంచి విద్యార్థులు చదవడం, రాయడం వంటి ప్రక్రియలపై పటిష్టమై అభివృద్ధి చెందేలా విద్యార్థులు అడుగులు వేయాలన్నారు. అనంతరం ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ బోధన అభ్యాసన మెరుగు పరుచుకోవాలన్నారు. ఆయన వెంట ఎంఈవోలు ఎ. గోవిందరావు, సీహెచ్ తిరుమ లరావు ప్రిన్సిపాల్ కేవీ రత్నకుమారి ఉన్నారు.