విధులు బహిష్కరించి న్యాయవాదుల నిరసన
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:54 PM
అనంతపురం పట్టణంలో న్యాయవాది చంద్ర శేఖర్ రెడ్డిపై పోలీ సులు ప్రవర్తించిన తీరును నిరసిస్తూ శుక్రవారం స్థానిక జూనియర్ సివిల్ కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరిం చారు.
ఆమదాలవలస, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): అనంతపురం పట్టణంలో న్యాయవాది చంద్ర శేఖర్ రెడ్డిపై పోలీ సులు ప్రవర్తించిన తీరును నిరసిస్తూ శుక్రవారం స్థానిక జూనియర్ సివిల్ కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరిం చారు. బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కణితి విజయలక్ష్మీబాయి ఆధ్వర్యంలో సమావేశం నిర్వ హించారు. అనంతరం కోర్టు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. న్యాయవాదిపై సీఐ, ఎస్‌ఐ దురుసుగా ప్రవర్తించి గాయపర్చడం దారుణమన్నారు. కక్షి దారుల విషయం మాట్లాడానికి పోలీస్‌స్టేషన్ కు వెళ్లిన న్యాయవాదులపై ఇటీవల కాలంలో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు అధికంగా జరుగుతున్నాయని, ఇలాంటివి పున రావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు సాధు ధనుంజయరావు, తమ్మినేని అన్నంనాయుడు, బొడిగి రమణ, వాడవలస రాజేశ్వరరావు, బి. సీతారాం, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.