న్యాయవాదులు విధుల బహిష్కరణ
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:34 AM
స్థానిక కోర్టు సముదాయం పరిధిలో శుక్రవారం న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు.
టెక్కలి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): స్థానిక కోర్టు సముదాయం పరిధిలో శుక్రవారం న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాలని... కోర్టుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సాయంత్రం నుంచి రాత్రి 9గంటల వరకు కోర్టులు పనిచేయడం వల్ల న్యాయవాదులు, కక్షిదారులు, గ్రామీణ ప్రాంత ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని న్యాయవాదులు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు దివ్వల వివేకానంద, పేడాడ బాబూరావు, ఎస్.రమణరావు, మధుబాబు, రాజన్నాయుడు, పొట్నూరు ఆనందరావు, భుజంగరావు, వైకుంఠరావు పాణిగ్రహి, చంద్రుడు, ప్రభుచంద్ర, సూర్యరాజు,ఽ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.