ఆలస్యంగా భోజనం
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:28 PM
స్థానిక బాలికోన్నత పాఠశాలలో 40 మంది విద్యార్థినుల అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఇప్పటి వరకు వంట చేసిన నిర్వా హకులు శుక్రవారం వంట చేయలే మంటూ సామగ్రిని తీసుకు వెళ్లి పోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇబ్బందులుపడిన విద్యార్థినులు
వంట పాత్రలను తరలించిన ఏజెన్సీ నిర్వాహకులు
సోంపేట, జూలై 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక బాలికోన్నత పాఠశాలలో 40 మంది విద్యార్థినుల అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఇప్పటి వరకు వంట చేసిన నిర్వా హకులు శుక్రవారం వంట చేయలే మంటూ సామగ్రిని తీసుకు వెళ్లి పోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివరాలిలా ఉన్నా యి.. పాఠశాలలో గత శుక్రవారం 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో దానికి తమనే బాధ్యులను చేస్తున్నారంటూ వంట ఏజెన్సీ నిర్వాహకులు ఆవేదన చెందుతూ శుక్రవారం వంటలను వండకుండా సామగ్రిని పాఠశాల నుంచి తీసుకు వెళ్లిపోయారు. గత 18 ఏళ్లుగా వంట చేసి విద్యా ర్థినులకు వండి పెడు తున్నామని, అయితే ఇటీవల ఫుడ్ పాయిజన్ జరిగిందని, ముందు హెచ్‌ఎంను, ఆ తరువాత మిమ్మల్ని తొలగిస్తామని ఓ ఉపాధ్యాయిని హెచ్చరించడం దారుణమని, కావాలనే మాపై నిందలు మోపుతున్నారని వంట నిర్వాహ కులు టి.భారతి, జి.చిరంజీవు, వైధనలక్ష్మి, పి.పద్మ తదితరులు వాపోయారు. తాము వంట చేసేది లేదంటూ భీష్మించి ఇన్‌చార్జి హెచ్‌ఎంకు వినతి పత్రం ఇచ్చారు. ఆ తరువాత పాఠశాల నుంచి వంట పాత్రలను తరలించారు. మా తప్పిదం లేకుండా డ్రిల్ ఉపాధ్యాయురాలి వల్లే మాపై నిందలు వస్తున్నాయని వాపోయారు. ఉన్నతాధి కారుల నుంచి స్పష్టమైన హామీ లభిస్తే గాని వంట చేయలేమని వారు ఆ వినతి పత్రంలో స్పష్టం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న ఎంఈవోలు ఎస్.జోరాడు, కృష్ణంరాజు స్పందించారు. పాఠశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించి వేరే వ్యక్తులతో భోజనం వండించి విద్యార్థి నులకు పెట్టారు. దీంతో మధ్యాహ్నం 12.30 గంటలకు భోజనం చేయాల్సి ఉండగా ఒంటి గంటకు సుమారు అరగంట ఆలస్యంగా విద్యార్థి నులు తిన్నారు.