Share News

భారీగా గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:55 PM

పొందూరు రైల్వేస్టేషన్‌లో గురువారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న 31 కేజీల గంజాయిని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 భారీగా గంజాయి స్వాధీనం
గంజాయిని పరిశీలిస్తున్న తహసీల్దార్‌, పోలీసులు

  • పొందూరు రైల్వేస్టేషన్‌లో పట్టుకున్న పోలీసులు

పొందూరు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): పొందూరు రైల్వేస్టేషన్‌లో గురువారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న 31 కేజీల గంజాయిని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆమదాలవలస సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ రాజేష్‌ వివరాలు వెల్లడించారు. గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు గురువారం ఎస్‌ఐ రాజేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైల్వేస్టేసన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన మునాఫ్‌సాబ్‌, సునీల్‌తల్వార్‌లను పట్టుకుని పరిశీలించారు. సూట్‌కేసుల్లో తరలిస్తున్న సుమారు రూ.1.95 లక్షల విలువచేసే గంజాయిని స్వాఽధీనం చేసుకున్నారు. పొందూరు తహసీల్దార్‌ ఆర్‌.వెంకటేష్‌ ఆధ్వర్యంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి..కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Updated Date - Oct 30 , 2026 | 11:55 PM