Share News

ఎచ్చెర్ల టీడీపీ ఇన్‌చార్జిగా లంక శ్యామ్‌

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:41 PM

Appointed Etcherla TDP in-charge ఎచ్చెర్ల టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రణస్థలం మండలం రావాడ గ్రామానికి చెందిన సీనియర్‌ నాయకుడు లంక శ్యామలరావును నియమించారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ ఆదివారం ప్రత్యేక ప్రకటన జారీచేశారు.

ఎచ్చెర్ల టీడీపీ ఇన్‌చార్జిగా లంక శ్యామ్‌
లంక శ్యామలరావు

  • రెండేళ్ల తర్వాత నియామకం

  • రణస్థలం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రణస్థలం మండలం రావాడ గ్రామానికి చెందిన సీనియర్‌ నాయకుడు లంక శ్యామలరావును నియమించారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ ఆదివారం ప్రత్యేక ప్రకటన జారీచేశారు. గత రెండేళ్లుగా ఈ పదవి ఖాళీగా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఎచ్చెర్ల అసెంబ్లీని బీజేపీకి కేటాయించారు. ఆ పార్టీ తరపున నడుకుదుటి ఈశ్వరరావు పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికలకు ముందు వరకూ ఇన్‌చార్జిగా సీనియర్‌ నేత కళా వెంకటరావు ఉండేవారు. అప్పట్లో సమీకరణల దృష్ట్యా ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లి అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. అయితే 2024 ఎన్నికల నుంచి ఎచ్చెర్ల టీడీపీ ఇన్‌చార్జి పోస్టు ఖాళీగా ఉండేది. దీనిపై ఇటీవల ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, అబ్జర్వర్‌ రాఽధాకృష్ణ.. పార్టీశ్రేణుల నుంచి అభిప్రాయాన్ని సేకరించారు. పార్టీ పరిశీలకుడి ద్వారా అధిష్ఠానానికి నివేదిక పంపించారు. దీంతో నియోజకవర్గంలో అధికంగా ఉన్న తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన లంక శ్యామలరావును నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. శ్యామ్‌ గతంలో రణస్థలం మండల టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2013 నుంచి 2018 వరకూ రావాడ సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన భార్య గతంలో రణస్థలం జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.

  • సైనికుడిలా పనిచేస్తా :

  • తెలుగుదేశంపార్టీ బలోపేతానికి సైనికుడిలా పనిచేస్తానని ఎచ్చెర్ల టీడీపీ అధ్యక్షుడు లంక శ్యామలరావు తెలిపారు. సీనియర్‌ నాయకుల సహకారంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తానన్నారు. తనపై నమ్మకంతో ఈ పదవి అప్పజెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పరిశీలకులు రాధాకృష్ణ, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Sep 06 , 2026 | 11:41 PM