Share News

భూములను పరిరక్షించాలి

ABN , Publish Date - May 19 , 2026 | 11:52 PM

ఆదివాసీయుల భూములను పరిరక్షించా లని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి డిమాండ్‌ చేశారు.

    భూములను పరిరక్షించాలి
నిరసన తెలుపుతున్న గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు:

పాతపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీయుల భూములను పరిరక్షించా లని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి డిమాండ్‌ చేశారు. మంగళవారం మండలంలోని సవర సిద్దమణుగులో 40ఎకరాల భూమిపై ఒడిశావారు ఆక్రమణలకు పాల్పడుతున్నారని పేర్కొని ఆదివాసీ సంఘనేతలు క్షేత్రస్థాయి పరిశీలించారు. ఈ సందర్భంగా వాబయోగి మా ట్లాడుతూ సవరసిద్దమణుగులో ఒడిశాకు చెందిన కొంతమంది భూదళారులు ఆదివాసీయులకు బెదిరించి మోసాలకు పాల్పడుతూ అక్కడి భూములు కాజేయాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఐటీడీఏ పీవో, కలెక్టర్‌, స్థానిక శాసనసభ్యులు కలుగజేసుకొని ఆదివాసీయులు సాగుచేస్తున్న భూములను రక్షించాలని, అక్కడ ఆదివాసీ మహిళలకు పూర్తిగా రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన చైతన్యవేదిక జిల్లా అధ్యక్షుడు జన్ని సంజీవరావు, ఆదివాసీ సంక్షేమపరిషత్‌ సభ్యుడు వాసుదేవరావు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2026 | 11:52 PM