Share News

సీఆర్‌పీఎఫ్‌ కార్యాలయానికి భూమి కేటాయించాలి

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:38 PM

విశాఖపట్నంలో సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) 234వ బెటాలియన్‌కు శాశ్వత ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు 21.2 ఎకరాల భూమిని కేటా యించాలని కమాండెంట్‌ మనోజ్‌కుమార్‌యాదవ్‌ కోరారు.

సీఆర్‌పీఎఫ్‌ కార్యాలయానికి భూమి కేటాయించాలి

కేంద్రమంత్రిని కోరిన కమాండెంట్‌

శ్రీకాకుళం అర్బన్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) 234వ బెటాలియన్‌కు శాశ్వత ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు 21.2 ఎకరాల భూమిని కేటా యించాలని కమాండెంట్‌ మనోజ్‌కుమార్‌యాదవ్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడును ఆయన నివాసంలో సంబంధిత అధికారులతో కలిసి వినతిపత్రం అందిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం విశాఖ డీటీసీ ప్రాం గణంలో ఏపీఎస్పీకి చెందిన స్థలంలో బెటాలియన్‌ కార్యకలాపాలు నిర్వ హిస్తున్నామన్నారు. రాష్ట్రంలో సీఆర్‌పీఎఫ్‌కు ప్రత్యేక శాశ్వత కార్యా లయాలు లేవని, విశాఖలో కార్యాలయం ఏర్పాటు అవసర ముందని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. విశాఖపట్నంలో భూమి కేటాయింపు సాధ్యంకాని పక్షంలో ప్రత్యామ్నాయంగా విజయ నగరం జిల్లాలో కేటా యించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:38 PM