Share News

భూ హక్కు పట్టాలు అందజేయాలి

ABN , Publish Date - Sep 22 , 2026 | 12:09 AM

చిలకపాలెం గ్రామపంచాయతీ నారాయణ పురంలో సాగులో ఉన్న రైతు లకు భూహక్కు పట్టాలు అంద జేయాలని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. లేదంటే ఉద్యమం ఉధృ తం చేస్తామని హెచ్చరించారు.

భూ హక్కు పట్టాలు అందజేయాలి
ర్యాలీ ప్రారంభిస్తున్న సీపీఎం రాష్ట్రకార్యదర్శి శ్రీనివాసరావు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌

ఎచ్చెర్ల రూరల్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): చిలకపాలెం గ్రామపంచాయతీ నారాయణ పురంలో సాగులో ఉన్న రైతు లకు భూహక్కు పట్టాలు అంద జేయాలని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. లేదంటే ఉద్యమం ఉధృ తం చేస్తామని హెచ్చరించారు. భూ హక్కు కోరుతూ చిలక పాలెం నుంచి కలెక్టరేట్‌ వరకు పాదయాత్రను సోమ వారం ఆయన జెండాఊపి ప్రారంభిం చారు. భూ పోరాట కమిటీ కన్వీనర్‌ తోనంగి నందోడు ఆధ్వర్యంలో నిర్వహించి సమావేశంలో ఆయన మాట్లాడుతూ తరతరాలుగా సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. 50 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నా రైతులకు న్యాయం జరగలేదన్నారు. రైతులు పక్షాన ఉంటూ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చా రు. కొందరు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో భూముల స్వాహాకు యత్నిస్తున్నారని, వాటిని రద్దుచేసి అర్హులైన రైతులకు ఇవ్వాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె.మోహన్‌రావు, పి.తేజేశ్వరరావు, బి.కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 12:09 AM