Share News

భూ రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలి

ABN , Publish Date - Jan 31 , 2026 | 11:38 PM

రైతుల భూము లకు సంబంధించిన భూ రికార్డులు సక్రమం గా నిర్వహిం చాలని ట్రైనీ కలెక్టర్‌ డి.పృథ్వీరాజ్‌ కుమార్‌ అన్నారు.

భూ రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలి
రికార్డులను పరిశీలిస్తున్న ట్రైనీ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌ కుమార్‌

ట్రైనీ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌ కుమార్‌

జి.సిగడాం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): రైతుల భూము లకు సంబంధించిన భూ రికార్డులు సక్రమం గా నిర్వహిం చాలని ట్రైనీ కలెక్టర్‌ డి.పృథ్వీరాజ్‌ కుమార్‌ అన్నారు. శని వారం మండలంలో ఆయన పర్య టించారు. జాడలో జరు గుతున్న రీ-సర్వే, మండల కేంద్రంలో రేషన్‌ డిపో-1 తనిఖీ చేశారు. పక్కాగా రీ-సర్వే నిర్వహించాలన్నారు. రేషన్‌ దుకా ణాల్లో తూకంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పని వేళల్లో రేషన్‌ దుకా ణాలను తెరిచి ఉంచాలని, సరుకుల వివరాల బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో రికా ర్డులను పరిశీలించారు. పీజీఆర్‌ఎస్‌, ఇతర అర్జీలను వెంట వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ ఎం.సరిత, డీటీ ఎన్‌.నిర్మల, రీ-సర్వే డీటీ కె.గాయత్రి, ఆర్‌ఐ ఎ.రాధ, మండల సర్వేయర్‌ శాంతారాం తదితరులున్నారు.

Updated Date - Jan 31 , 2026 | 11:38 PM