Share News

భూసమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:16 AM

):భూ సమస్యలను ప్రాధా న్యతాక్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆమదాలవలస ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ కోరారు. శ్రీకాకు ళంలోని జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో రవికుమార్‌ బూర్జ, పొందూరు, ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాల రెవెన్యూ సమస్యలు, భూవ్రివాదాలు, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన భూములు లభ్యత, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలు తదితర అంశాలపై చర్చించారు.

భూసమస్యలు పరిష్కరించాలి
మాట్లాడుతున్న రవికుమార్‌:

శ్రీకాకుళం, జూలై 23 (ఆంధ్రజ్యోతి):భూ సమస్యలను ప్రాధా న్యతాక్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆమదాలవలస ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ కోరారు. శ్రీకాకు ళంలోని జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో రవికుమార్‌ బూర్జ, పొందూరు, ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాల రెవెన్యూ సమస్యలు, భూవ్రివాదాలు, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన భూములు లభ్యత, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూముల విషయంలో వేగంగా చర్యలు తీసుకోవాలని, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్ర క్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

బ్యారేజీకి పరిపాలన అనుమతులపై హర్షం

ఆమదాలవలస, జూలై 23 (ఆంధ్రజ్యోతి): నేరడి బ్యారేజీ నిర్మాణానికి రూ.641.10 కోట్లు పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంపై ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్‌ హర్షం వ్యక్తం చేశారు.గురువారం ఆమదాలవలసలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 61 ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న నేరడి బ్యారేజీ సాకారం దిశగా అడుగులు వేయడం జిల్లాకు శుభపరిణామమన్నారు.

Updated Date - Jul 24 , 2026 | 12:16 AM