ఎట్టకేలకు భూ సమస్య పరిష్కారం
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:06 AM
పట్టణంలోని పాత ఆమదాలవలస రెవెన్యూ గ్రామ పరిధిలో నెలకొన్న భూ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం జరిగింది.
ఇరువర్గాల అంగీకారంతో హద్దులు నిర్ధారణ
ఆమదాలవలస, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పాత ఆమదాలవలస రెవెన్యూ గ్రామ పరిధిలో నెలకొన్న భూ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం జరిగింది. ఈ మేరకు బాధిత రైతు బొడ్డేపల్లి రంగ నాయుడు.. తన భూమిలో వైసీపీ సీనియర్ నేతలు ఇంటి నిర్మాణ వ్యర్థాలను వేస్తున్నారని, తగు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో నిర్వహిం చిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన స్పం దించి తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు ఆదే శించారు. ఈమేరకు కలెక్టర్ స్పందించి జారీ చేసిన ఆదేశాలతో సమీపంలోని రైతులకు ఆర్డీవో నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం డీఐవో సదాశివుని వెంకటేశ్వర్లు ఆధ్వ ర్యంలో అధికారులు పరిసర ప్రాంత రైతుల ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. ఈ సర్వేలో ఫిర్యా దుదారు రంగనాయుడుకు చెందిన 40 సెంట్ల భూమి హద్దులు నిర్ధారణ చేసి ఇరువర్గాల రైతు ల నుంచి సమస్య పరిష్కారమైనట్లు అధికా రులు ధ్రువీకరణ పత్రాలు స్వీకరించారు. తన భూమి ఆక్రమణకు గురికాకుండా హద్దులను నిర్ణయించి తగు చర్యలు తీసుకున్న మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు రంగనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్ర మంలో మండల సర్వేయర్ బొడ్డేపల్లి గోపి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.