Share News

భూ వివాద కేసులను పరిష్కరించాలి

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:29 PM

Land dispute .. resolved భూవివాద కేసులను రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి ఆయన ఆర్డీవోలు, తహసీల్దార్లు, పోలీసు అధికారులతో రెవెన్యూ సదస్సు నిర్వహించారు.

భూ వివాద కేసులను పరిష్కరించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): భూవివాద కేసులను రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి ఆయన ఆర్డీవోలు, తహసీల్దార్లు, పోలీసు అధికారులతో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. పోలీసుస్టేషన్ల వారీగా భూ వివాద కేసులను కలెక్టర్‌ తెలుసుకున్నారు. అధికార దుర్వినియోగం జరగకుండా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘తప్పుడు కేసులకు అండదండలు అందించిన వారికి భయం కలిగేలా కఠినంగా వ్యవహరించాలి. బైండోవర్‌ కేసుల్లో పూచీకత్తుగా ఉన్న మొత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లోను తగ్గించకూడద’ని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 292 కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి మాట్లాడుతూ తహసీల్దార్లు, వీఆర్వోలు వివరాల సేకరణలో పోలీసు అధికారులకు తగు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో శ్రీకాకుళం, పలాస, టెక్కలి ఆర్డీవోలు సాయిప్రత్యూష, వేంకటేశ్వరరావు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 11:29 PM