పదవీ కాంక్షతోనే లక్ష్మీదేవి వైసీపీలోకి వెళ్లారు
ABN , Publish Date - Oct 22 , 2026 | 11:46 PM
మాజీ మంత్రి గుండ కుటుంబానికి టీడీపీ అనేక అవకాశాలు కల్పించిందని, ఎప్పుడూ వారికి పార్టీ అన్యాయం చేయ లేదని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
‘గుండ’ కుటుంబానికి పార్టీ అన్యాయం చేయలేదు
ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం అర్బన్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి గుండ కుటుంబానికి టీడీపీ అనేక అవకాశాలు కల్పించిందని, ఎప్పుడూ వారికి పార్టీ అన్యాయం చేయ లేదని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ.. పదవీ కాంక్షతోనే మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీ దేవి వైసీపీలో చేరారన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, నైతిక విలువల కమిటీ చైర్మన్గా అనేక అవకాశాలిచ్చిందన్నారు. అలాగే లక్ష్మీదేవి కి కూడా రెండు పర్యాయాలు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు హయాం నుంచి ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ వరకు ఆ కుటుంబంపై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. అప్పల సూర్యనారాయణ మరణించినప్పు డు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించామని, జిల్లా పార్టీ కార్యాలయం లో సంతాప సభ ఏర్పాటు చేశామన్నారు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన పేరుతో ప్రాంగణానికి నామకరణం చేయడం తమ కుటుం బంపై పార్టీకి ఉన్న గౌరవా నికి నిదర్శన మన్నారు. తనకు పార్టీ టికెట్ కేటాయించి నప్పటి నుంచి లక్ష్మీదేవి అసంతృప్తితో ఉన్నారని, ప్రలు తనను అధిక మెజార్టీతో గెలిపించారన్నారు. పార్టీ వారి కుటుంబానికి చేసిన సేవలను గుర్తించకుండా పార్టీనే తప్పుబట్టడం సరికాదన్నారు. కార్పొరేషన్ ఎన్నికల సమ యంలో పార్టీ మారడం వెనుక మేయర్ పదవిపై ఆశే కారణమన్నారు. తన కుమారుడికి రాజకీయ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ గుండ కుటుంబానికి ఎలాంటి అన్యాయం చేశారో బహిరంగంగా చర్చించేందుకు ముందుకు రావాలని, తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. నియోజకవర్గ గొడ్డలి పార్టీ నాయకుడి ట్రాప్లో గుండ లక్ష్మీదేవి పడ్డారని, పక్క నియోజకవర్గం నుంచి వెంటబెడితే ఆయన ఇక్కడికి వచ్చాడన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యా నికి, అభివృద్ధికి నష్టం జరిగిందని ఆరోపిస్తూ ఇప్పుడు ఎన్నికలు, రాజ్యాం గం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గుండ లక్ష్మీదేవి తన నిర్ణయాన్ని పునరాలో చించుకో వాలని సూచించారు. నగరంలోని 60 వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేస్తా మన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు పీఎంజేబాబు, మాదా రపు వెంకటేష్, కొర్ను ప్రతాప్, కలగ జగదీష్, లోపింటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.