Share News

గోదాములు లేక.. నిల్వ చేయలేక

ABN , Publish Date - Nov 03 , 2026 | 12:02 AM

పాతపట్నం మండలంలోని కొరసవాడ, కాగువాడ, రొంపివలస, సీది, తీమర గ్రామాల్లో వరి పంట కోసిన రైతులు వర్షాలు కురుస్తుండడంతో నిల్వ చేయడానికి గోదాములు లేక ఆందోళన చెందుతు న్నారు.

గోదాములు లేక.. నిల్వ చేయలేక
కొరసవాడ వద్ద రోడ్డు పక్కన ధాన్యం బస్తాలపై పరదాలు కప్పిన రైతులు::

పాతపట్నంరూరల్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): పాతపట్నం మండలంలోని కొరసవాడ, కాగువాడ, రొంపివలస, సీది, తీమర గ్రామాల్లో వరి పంట కోసిన రైతులు వర్షాలు కురుస్తుండడంతో నిల్వ చేయడానికి గోదాములు లేక ఆందోళన చెందుతు న్నారు. మహేంద్రతనయ నది పరీవాహకంతో పాటు వర్షాధార ప్రాంతాల్లో పంట కోసిన వెంటనే ధాన్యం ఆరబెట్టేందుకు అగచాట్లకు గురవుతున్నా రు. ఆయా గ్రామాల్లో ఖరీఫ్‌లో సాగుచేసిన పం టలను ప్రస్తుతం ముమ్మరంగా కోస్తున్నారు. ఇటీవల ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు మండలంలో వందలాది ఎకరాల్లో వరి, ఉద్యాన పంటలు నష్టం వాటిల్లిన సంగతి తెలి సిందే. అయితే సోమవారం నుంచి ప్రారంభమైన మురాసు తుఫాన్‌ నేపథ్యంలో కురుస్తున్న వర్షా లకు ధాన్యం రాశులు, బస్తాలను కాపాడుకునేం దుకు రైతులు అవస్థలు పడుతున్నారు. పంటను ఆరబెట్టుకునేందుకు సరైన స్థలం లేక, నిల్వ చేసు కునేందుకు గోదాములు అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు పరదాలు కప్పుతూ, బస్తాలను భద్రపరిచేందుకు పాట్లు పడుతున్నారు. మరోవైపు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందు కొస్తారో లేదోనన్న ఆందోళన రైతుల్లో వెంటాడు తోంది. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి పంట పం డించిన రైతులకు ప్రకృతి వైపరీత్యాలు శాపంగా మారాయి. పండించిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ ఉంచాలో, ఎవరికి విక్రయించాలో తెలియక దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందిం చి ధాన్యం నిల్వకు తగిన సౌకర్యాలు కల్పించా లని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Nov 03 , 2026 | 12:02 AM