నిర్వహణకు నోచుకోక.. సిబ్బంది లేక
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:05 AM
మం డలంలోని పశువైద్య కేంద్రాలు శిథిలావస్థకు చేరాయి. దీనికితోడు సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. సం తబొమ్మాళి, బోరుభద్ర, కొల్లిపాడులో పశువైద్య కేంద్రా లు, దండుగోపాలపురం, నౌపడల ఉప కేంద్రాల నుంచి మండలంలో 12,220 ఆవులు, గేదెలు, 35వేల మేకలు, గొర్రెలు, లక్షకు పైగా కోళ్లకు సేవలందాల్సి ఉంది.
సంతబొమ్మాళి, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): మం డలంలోని పశువైద్య కేంద్రాలు శిథిలావస్థకు చేరాయి. దీనికితోడు సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. సం తబొమ్మాళి, బోరుభద్ర, కొల్లిపాడులో పశువైద్య కేంద్రా లు, దండుగోపాలపురం, నౌపడల ఉప కేంద్రాల నుంచి మండలంలో 12,220 ఆవులు, గేదెలు, 35వేల మేకలు, గొర్రెలు, లక్షకు పైగా కోళ్లకు సేవలందాల్సి ఉంది. బోరుభద్ర, సంతబొమ్మాళి, దండుగోపాలపు రం పశువైద్య కేంద్రాలు నిర్వహణకు నోచుకోకపో వడంతో శిథిలావస్థకు చేరిపోయాయి. సంతబొమ్మాళి, బోరుభద్రలో వర్షం కురిస్తే భవనాలు కారిపోతున్నా యి. బోరుభద్రలో కొత్త పశువైద్య కేంద్రం నిర్మించినా అది గ్రామానికి దూరంగా ఉండడంతో చిన్నపాటి పశువైద్యశాల పాతభవనంలో భవనంలో నడుపుతు న్నారు. దీంతో కొత్త భవనం ప్రారంభం కాకపోతే శిథి లావస్థకుచేరింది. బోరుభద్రలో పశువైద్యధికారి పోస్టు, నౌపడలోని పశువైద్య ఉపకేంద్రంలో జూనియర్ వెట ర్నరీ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉండడంతో మర్రిపాడు సచివాల ఏహెచ్‌వో ఇన్‌చార్జిగా సేవలందిస్తున్నారు. కాగా మండలంలో పశువైద్య కేంద్రాలు శిథిలావస్థకు చేరడంపై మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువె ళ్లామని టెక్కలి పశుసంవర్ధక శాఖ ఏడీ బి.వెంకట రమణ తెలిపారు. సంతబొమ్మాళి పశువైద్య కేంద్రాన్ని తుఫాన్ సెంటర్‌లోకి మార్చి నూతన భవనం నిర్మా ణం చేపడతామని చెప్పారు. బోరుభద్రలో భవనం ప్రారంభ కాకుండా శిధిలావస్థకు చేరిన భవనానికి నిధులు మంజూరు చేసి వినియోగంలోకి తీసుకు వస్తామని తెలిపారు.