Share News

బెర్ములు లేక.. విస్తరణకు నోచుకోక

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:48 PM

మండలంలోని నౌపడ- వెంక టాపురం రహదారి విస్తరణకు నోచుకోకపోవడంతోపాటు ఇరువైపులా బెర్ములు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నిత్యంరద్దీగా ఉండే ఈ రహదారి మరమ్మతులకు నోచుకోకపోవడంతో గోతు లమయమయ్యింది.

బెర్ములు లేక.. విస్తరణకు నోచుకోక
గోతులమయమైన నౌపడ-వెంకటాపురం రహదారి :

సంతబొమ్మాళి, జూలై19(ఆంధ్రజ్యోతి): మండలంలోని నౌపడ- వెంక టాపురం రహదారి విస్తరణకు నోచుకోకపోవడంతోపాటు ఇరువైపులా బెర్ములు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నిత్యంరద్దీగా ఉండే ఈ రహదారి మరమ్మతులకు నోచుకోకపోవడంతో గోతు లమయమయ్యింది. దీంతో వర్షాలకు గోతుల్లో నీరు చేరడం వల్ల వాహన చోదకులు అవస్థలకు గురవుతున్నారు. ఈనేపథ్యంలో మరమ్మతులకు నోచు కోకపోవడంతోపాటు ఇరువైపులా బెర్ములు వేయకపోవడంతో ఎదురుగా వాహనాలు వచ్చే సమయంలో ద్విచక్ర వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. కాగా ఈ రహదారికి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు నుంచి రూ.48కోట్ల కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మంజూరు చేయిం చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌ఎఫ్‌కు మ్యాచింగ్‌ గ్రాంట్‌ మంజూరు చేయాల్సిఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం సీఆర్‌ఎఫ్‌ గ్రాంట్‌ ఇతర అవస రాలకు వినియోగించడంతో మ్యాచింగ్‌ గ్రాంట్‌ జమకావడంలో జాప్యం నెలకొంది. కాగా కేంద్ర ప్రభుత్వం నుంచి 48 కోట్ల రూపాయలు ఈ రహ దారి విస్తరణకు మంజూరయ్యావని టెక్కలి ఆర్‌అండ్‌బీ ఏఈ జగదీష్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

Updated Date - Jul 19 , 2026 | 11:48 PM