Share News

వసతులులేక..హాల్టింగ్‌కు నోచుకోక

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:07 AM

సుమ్మా దేవి స్టేషన్‌లో సమస్యల కూత వినిపిస్తోంది. ఇక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనికితోడు ఇక్కడ ఒక్క పలాస టూ కటక్‌ మాత్రమే ఆగుతోంది. మిగతా రైళ్లకు హాల్టింగ్‌ సదుపాయం కల్పించాలని ఉద్దానం వాసులు సుదీర్ఘకాలంగా డిమాండ్‌చేస్తున్నారు.

వసతులులేక..హాల్టింగ్‌కు నోచుకోక
బోసిపోతున్న సుమ్మాదేవి రైల్వేస్టేషన్‌

పలాసరూరల్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సుమ్మా దేవి స్టేషన్‌లో సమస్యల కూత వినిపిస్తోంది. ఇక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనికితోడు ఇక్కడ ఒక్క పలాస టూ కటక్‌ మాత్రమే ఆగుతోంది. మిగతా రైళ్లకు హాల్టింగ్‌ సదుపాయం కల్పించాలని ఉద్దానం వాసులు సుదీర్ఘకాలంగా డిమాండ్‌చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

పలాస రైల్వే స్టేషన్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరం లో ఉన్న ఇక్కడ బ్రిటీష్‌ కాలం నుంచి రెండు ప్లాట్‌ఫారాలతో కొనసాగుతోంది. స్టేషన్‌లో ఆపరేటింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ముగ్గురు, సిగ్నల్‌ శాఖకు సంబంధించి ఇద్దరు, ఐఓడబ్ల్యు సంబంధించి 10మంది ఉన్నారు. ఈ స్టేషన్‌ పరిధిలో సుమ్మాదేవి, కొబ్బరిచెట్ల వూరు, నీలావతి గేట్లుఉన్నాయి. వీటిలో 12మంది ఉద్యో గులు గేట్‌కీపర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అప్పట్లో ఉత్తమ రైల్వేస్టేషన్‌గా పేరొందింది. ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి అభివృద్ధి, మౌలిక సౌకర్యాలు లేవు. ఒకప్పుడు ఇక్కడి నుంచి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూరగా యలతోపాటు సరకు లు తరలించేవారు. పాసింజర్‌ టికెట్లు కూడా అమ్మకాలు ఎక్కువ జరిగేవి. గతంలో పలాసలో స్టేషన్‌లో ఎటు వంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా రైళ్లు ఆగే సమయంలో ఈ స్టేషన్‌ను ప్రత్యామ్నాయంగా ఉపయోగించే వారు. ప్రస్తుతం కేవలం ఒకే ఒక పాసింజర్‌ రైలు (పలాస టూ కటక్‌- 08534-08533) మాత్రమే ఉదయం 4.15 నిమిషాలకు, తిరిగి రాత్రి 10.20 సమయానికి ఈ స్టేషన్‌లో నిలుపుదల చేస్తున్నారు. గతంలో ఈ ప్రాంతం నుంచి ఉదయం, రాత్రి వేళల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. ఇక్కడికి మాకినపల్లి, నీలావతి, సుమ్మావతి, బొడ్డపాడు, రంగోయి తదితర గ్రామాల ప్రజలకు దగ్గరగా ఉండడంతో హాల్టింగ్‌ సదుపాయం కల్పిస్తే తమకు వాణిజ్య, రవాణాపరంగా ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు చెబుతున్నారు.

ఇవీ సమస్యలు..

ఫ స్టేషన్‌లో సరైన విద్యుత్‌ సౌకర్యం, కనీస సదుపా యాలు, స్టేషన్‌కు చేరుకునేందుకు సరైన రహదారి లేకపోవడంతో వెలవెలబోతుంది. ఫ అయితే ఉద్యోగులు ఉండేందుకు క్వార్టర్లు, విశ్రాంతి గదులు లేకపోవడంతో ఉద్యోగులు పలాస నుంచి సుమ్మాదేవికి రాకపోకలు సాగిస్తున్నారు. రాత్రిపూట విధులు నిర్వహించాల్సి వస్తే మాత్రం అత్యంత ప్రమాదకర ప్రయాణం చేయాల్సి వస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. రహదారి గుండా సరైన విద్యుత్‌ దీపాలు లేకపోవడం, రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడంతో వర్షాకాలమైతే నరకప్రాయమైన ప్రయాణం చేస్తూ విధులకు చేరుకోవాల్సి ఉంటుందని వారు ఆవే దన వ్యక్తం చేశారు. ఫ ఉద్యోగులు విశ్రాంతి తీసుకు నేందుకు సరైన గదులు లేకపోవడంతో ఇంజనీరింగ్‌ శాఖకు చెందిన ఓ రేకు గదిని విశ్రాంతి గదిగా వినియోగిస్తున్నారు. ఫ స్టేషన్‌ పరిసరాల్లో జీడితోటలు ఉండడంతో ఒక్కోసారి ఎలుగుబంట్లు ప్లాట్‌ఫారం మీదకు వస్తుండడంతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. ఫ ఉదయం కోతుల బెడద వల్ల ఒక్కోసారి పాసింజర్‌ రైళ్లు ఆపిన సమయంలో గుంపులుగా చేరి బీభత్సం చేస్తుంటాయని పలువురు వాపోతున్నారు.

Updated Date - Jan 19 , 2026 | 12:07 AM