‘లేబర్ కోడ్లను రద్దు చేయాలి’
ABN , Publish Date - Apr 01 , 2026 | 11:57 PM
కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని అఖిల పక్ష కార్మిక సంఘాల నాయకుడు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, టి.తిరుపతి రావు, మామిడి క్రాంతి, ఎస్.కృష్ణవేణి డిమాండ్ చేశారు.
అరసవల్లి, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని అఖిల పక్ష కార్మిక సంఘాల నాయకుడు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, టి.తిరుపతి రావు, మామిడి క్రాంతి, ఎస్.కృష్ణవేణి డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఆల్ ట్రేడ్ యూనియన్స్, ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ కూడలిలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడం దుర్మా ర్గమని, అందుకే ఈరోజున బ్లాక్ డేగా పరిగణిస్తున్నా మన్నారు. నిరసనలు, ధర్నాలు చేసేందుకు అనుమ తులను తప్పనిసరి చేయడం, అందుకు షరతులు విధించడం సరికా దన్నారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయ కులు ఎన్‌వీ రమణ, ఎం.ఆదినారాయణమూర్తి, ఎం.గోవర్థనరావు తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
ఎచ్చెర్ల, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌వీ రమణ డిమాండ్ చేశారు. అరిణాం అక్కివలస శ్యాంక్రగ్ పరిశ్రమ వద్ద బుధవారం కార్మికులు ఆందోళన నిర్వహించారు. కార్మిక చట్టాలను కార్పొరేట్ సంస్థలకు బానిస లుగా మార్చే లేబర్ కోడ్లను దేశ వ్యాప్తంగా అమలుచేయడం దుర్మార్గ మన్నారు. కార్యక్రమంలో యూని యన్ నాయ కులు పి.సురేష్, పి.శ్రీనుబాబు, జె.రామారావు, జి.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.