వింధ్యగిరిలో కొఠారి చండీమాత యాత్ర
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:52 PM
మండలం లోని వింధ్యగిరిలో వెలసిన కొఠారిచండీమాత యాత్ర గురువారం ఘనంగా జరిగింది. వేకువ జాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
కవిటి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): మండలం లోని వింధ్యగిరిలో వెలసిన కొఠారిచండీమాత యాత్ర గురువారం ఘనంగా జరిగింది. వేకువ జాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఒడిశా నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకొన్నారు. బుధవారం రాత్రి ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, విప్ బెందాళం అశోక్, ఒడిశాలోని చీకటి రాజవంశీకులతో పాటు తొలిదీపాన్ని వెలి గించి అమ్మవారి యాత్రకు అంకురార్పణ చేపట్టి ప్రత్యేకపూజలు నిర్వహించారు.భక్తులకు అసౌక ర్యాలు కలుగకుండా గ్రామస్థులు ఏర్పాట్లు చేశా రు. కవిటి పోలీసులు బందోబస్తు నిర్వహించి యాత్ర సజావుగా సాగేలా చర్యలు చేపట్టారు.