ఘనంగా కొండమ్మ యాత్ర
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:14 AM
మండలంలోని సింగుపు రంలో కొలువుదీరిన కొండమ్మ పార్వతీ సమేత హాటకేశ్వర స్వామి యాత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
శ్రీకాకుళం రూరల్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సింగుపు రంలో కొలువుదీరిన కొండమ్మ పార్వతీ సమేత హాటకేశ్వర స్వామి యాత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చైత్రశుద్ధ పాఢ్యమి నుంచి పూర్ణిమ వరకు జరిగే కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం నుంచి జిల్లా నలు మూలలు నుంచి పెద్దఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ఉత్సవాల్లో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. యువకులు ఎర్రని వస్త్రాలు ధరించి చేతిలో కర్ర కత్తులు బల్లాలతో ఊరేగించారు. హాటకేశ్వర స్వామివారిని ఊరేగింపుగా తీసుకుని వచ్చి గ్రామంలో అలంకరించిన వరికంకులు, వేప కొమ్మలు, కొబ్బరి కాయ లు, తోరణాలను యువకులు నరకడంతో ఉత్సవం ముగిసింది.
సోంపేటలో సీతారాముల కల్యాణం
సోంపేట, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): సోంపేటలోని కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గౌతు శివాజీ దంపతులు, ఆలయ కమిటీ చైౖర్మన్ బీన ఆనంద్, రెల్ల నారాయణ పాల్గొన్నారు.
సీతారాములకు పూజలు
కంచిలి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తలతంపరలో 14 గ్రామాల ప్రజలు నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా గురు వారం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ గురువారం సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు మర్రిపాటి పూర్ణ, సంతోష్‌రౌళో, సర్పంచ్ జగబంధుదొళాయి, బల్లెడ శివాజీ, సంతోష్, అభిమన్యు బిసాయ్, దుర్గాశ్రీనివాస్ పాల్గొన్నారు.