Share News

షార్ట్‌ సర్క్యూట్‌తో బడ్డీకొట్టు దగ్ధం

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:24 AM

షార్ట్‌ సర్క్యూట్‌ ఓ దివ్యాంగుడి బడ్డీకొట్టు (ఇందులోనే నివాసం) దగ్ధమైంది. సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో బుధ వారం జరిగిన అగ్ని ప్రమాదంలో దివ్యాంగుడైన కర్రి నాగరాజుకు జీవనాధారమైన బడ్డీ దగ్థమై సుమారు రూ.2లక్షల మేర ఆస్తి నష్టం సంభవిం చింది.

షార్ట్‌ సర్క్యూట్‌తో బడ్డీకొట్టు దగ్ధం
కాలిపోయిన సామగ్రి.. ఇన్‌సెట్లో డబ్బులు

  • రూ.1.20 లక్షల నగదు అగ్నికి ఆహుతి

  • సుమారు రూ.2లక్షలు ఆస్తి నష్టం

  • వీధినపడ్డ దివ్యాంగుడు

సంతబొమ్మాళి (కోటబొమ్మాళి), అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): షార్ట్‌ సర్క్యూట్‌ ఓ దివ్యాంగుడి బడ్డీకొట్టు (ఇందులోనే నివాసం) దగ్ధమైంది. సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో బుధ వారం జరిగిన అగ్ని ప్రమాదంలో దివ్యాంగుడైన కర్రి నాగరాజుకు జీవనాధారమైన బడ్డీ దగ్థమై సుమారు రూ.2లక్షల మేర ఆస్తి నష్టం సంభవిం చింది. ప్రమాదంలో ఆయన దాచుకున్న నగదుతో పాటు కొట్టులోని సామగ్రి పూర్తిగా కాలిపోయింది. ఒంటరిగా జీవిస్తున్న నాగరాజుకు వస్తున్న దివ్యాం గ పింఛన్‌తోనే జీవనం సాగిస్తున్నాడు. కొంత మొ త్తాన్ని ఖర్చులకు వినియోగిస్తూ, మిగిలిన మొత్తా న్ని పొదుపు చేసుకుంటూ వచ్చాడు. ఇలా దాచుకు న్న సుమారు రూ.1.20 లక్షలు నగదు ఆగ్నికి ఆహుతైంది. బడ్డీలోనే నివాసం ఉండడం వల్ల ఇతర సామగ్రి కూడా పూర్తిగా కాలిపోయింది. దీంతో నాగరాజు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాడు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి ఉమాపతి, వీఆర్వో జోగారావు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అలాగే టీడీపీ మండల అధ్యక్షుడు సుగ్గు శాంతి స్వరూప్‌ రెడ్డి రూ.5వేలు సాయాన్ని అందజేశారు. ఆర్థిక సహాయం బుధవారం అందజజేశారు. బాధితుడి నివాసం ఉండానికి రేకులషెడ్‌ ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు.

Updated Date - Oct 08 , 2026 | 12:24 AM