Share News

పాత్రికేయులను హత్య చేయడం దారుణం

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:06 AM

సమాజంలో నాలుగో స్తంభంగా ఉన్న పాత్రికేయులను రౌడీ మూకలు, విద్రోహక శక్తులు దాడులు చేసి హత్యలు చేయడం దారుణమని ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు అన్నారు.

పాత్రికేయులను హత్య చేయడం దారుణం
సరుబుజ్జిలి: నిరసన తెలుపుతున్న ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు, పాత్రికేయులు

  • ప్రజాసంఘాలు, పార్టీల నేతలు

  • ‘ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్‌ హత్యకు జర్నలిస్టు సంఘాల నిరసన

  • టెక్కలిలో డీఎస్పీకి వినతిపత్రం అందజేత

ఆమదాలవలస, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): సమాజంలో నాలుగో స్తంభంగా ఉన్న పాత్రికేయులను రౌడీ మూకలు, విద్రోహక శక్తులు దాడులు చేసి హత్యలు చేయడం దారుణమని ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు అన్నారు. చిత్తూరు జిల్లా ఆంధ్రజ్యోతి రిపోర్టుర్‌ జగన్మోహన్‌రెడ్డి హత్యను ఖండిస్తూ బుధవారం స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఆమదాలవలస ప్రింట్‌ మీడియా ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్రకార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్‌ మాట్లాడుతూ.. జర్నలిస్టును దారుణంగా హత్యచేయడం బాధాకరమని, బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువం టి ఘటనలను పార్టీల కతీతంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు గణిత విజయలక్ష్మి మాట్లాడుతూ.. సమాజంలో నాలుగో మూల స్తంభంగా ఉన్న పాత్రికేయరంగంపై హత్యలు, దాడులు జరగడం దురదృష్టకరమన్నారు రోటరీక్లబ్‌ కార్యదర్శి జలుమూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు జగన్మోహన్‌ రెడ్డి హత్య బాధాకరమన్నారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు గరుగుబెల్లి వెంకటరావు, న్యాయవాది బొడ్డేపల్లి మోహన్‌రావు, ప్రజా సంఘాల ఐక్యవేదిక సభ్యుడు బొడ్డేపల్లి జనార్దనరావు, మాజీ ఎంపీపీ గోవింద గోపాల్‌, ఎస్సీ రిజల్ట్స్‌ కమిటీ జిల్లా సభ్యుడు టి.ధనుంజయరావు, ఎస్పీ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ బోనెల అప్పారావు, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు గురుగుబెల్లి రమ ణారావు మాట్లాడారు. కార్యక్రమంలో పాత్రికేయులు ప్రసాదరావు, శంకరరావు, వెంకటరమణ, మోహన్‌రావు, వాసుదేవరావు, దుప్పల శ్రీనివాసరావు, చక్రధరరావు పాల్గొన్నారు.

జర్నలిస్టులపై దాడులు అమానుషం

టెక్కలి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వా నికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ ని స్వార్థంతో పనిచేసే జర్నలిస్టులపై దాడులు, హత్యలు చేయడం సరికాదని టెక్కలి ప్రెస్‌క్లబ్‌ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌ అన్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా వి.కోట ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్‌రెడ్డిని పట్టపగలే హత్య చేయడాన్ని ఖండిస్తూ బుధవారం సాయంత్రం అంబేద్కర్‌ కూడలి సమీపంలో ప్రెస్‌ క్లబ్‌ సభ్యులు కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువు రు మాట్లాడుతూ.. జగన్మోహన్‌రెడ్డి హత్యపై తక్షణమే ప్రభుత్వం స్పందిం చి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు, హత్యలు పెరుగు తున్నాయని, జగన్మోహన్‌రెడ్డికి జరిగిన వి ధంగా మళ్లీ ఏ ఒక్క జర్నలిస్టుకి కూడా జర గకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకో వాలన్నారు. మృతిచెందిన విలేకరి కుటుం బానికి ప్రభుత్వం సహాయం అందించి ఆదు కోవాలని కోరారు. అనంతరం టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావుకి వినతిపత్రం అంద జేశారు. కార్యక్రమంలో ప్రస్‌క్లబ్‌ కార్యదర్శి జర్జాన రామ్‌జీ, కోశాధికారి కూన రమేష్‌, జర్నలిస్టులు డి.శ్రీనివాసరావు, డి.కృష్ణ, రామారావు, జగదీష్‌, బాలకృష్ణ, శ్రావణ్‌, తేజ, హరి, పాపారావు, దుర్యోధన, భాస్కరరావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 12:06 AM