Kidney disease: కిడ్నీ మార్పిడి చేసినా ప్రాణం దక్కలే!
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:16 AM
Kidney disease:మండలంలోని చిన్న కొజ్జిరియా గ్రామానికి చెందిన బెందాళం రవి(43) అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో బుధవారం మృతి చెందాడు.
- చిన్న కొజ్జిరియాలో వ్యక్తి మృతి
కంచిలి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్న కొజ్జిరియా గ్రామానికి చెందిన బెందాళం రవి(43) అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో బుధవారం మృతి చెందాడు. రవికి భార్య సంగీత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పాఠశాలలో ఎస్‌ఎంసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కొన్నేళ్ల కిందట రవికి కిడ్నీ వ్యాధి సోకింది. అప్పటి నుంచి మందులు వాడుతున్నాడు. అయితే, రెండేళ్ల కిందట రెండు కిడ్నీలు పాడవడంతో భార్య సంగీత తన కిడ్నీని భర్తకు దానం చేసింది. దీంతో ఆ కిడ్నీని వైద్యులు రవికి అమర్చారు. అయినప్పటికీ భర్త మృతి చెందడంతో తన భవిష్యత్ ఏంటని భార్య రోదిస్తుంది. రవిపైనే భార్య పిల్లలతోపాటు తల్లి జోగమ్మ ఆధారపడి జీవిస్తున్నారు. కుటుంబ పెద్ద మరణంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.