ఊర్వశి మృతి కేసులో కీలక మలుపు
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:29 AM
సోంపేట మండలం గొల్లవూరులో అను మానాస్పద స్థితిలో మృతి చెందిన పిన్నింటి ఊర్వశి కేసు కీలక మలుపు తిరిగింది.
హత్యేనని క్లూస్ టీం ప్రాథమిక నిర్ధారణ?
సోంపేట రూరల్, జూన్ 19(ఆంధ్రజ్యోతి): సోంపేట మండలం గొల్లవూరులో అను మానాస్పద స్థితిలో మృతి చెందిన పిన్నింటి ఊర్వశి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఊర్వశి అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలంలో మృత దేహాన్ని, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాయి. మృతురాలి శరీరంపై ఉన్న ఆనవాళ్లు, ఘటనా స్థలం లోని పరిస్థితులను బట్టి ఇది ఆత్మహత్య కాదని, హత్య అయ్యే అవకాశం ఉందని క్లూస్‌టీం ప్రాథ మికంగా నిర్ధారించింది. పోలీసు జాగిలం ఘటనా స్థలం నుంచి కొంతదూరం వరకు వెళ్లే ఆగిపోయినట్టు సమాచారం. దీని ఆధారంగా పోలీసులు కొందరు అనుమానితులను గుర్తించి విచారిస్తున్నారు. క్లూస్ టీం సభ్యులు మృతదేహం నుంచి వేలిముద్రలు, వెంట్రుకలు, గోర్లలోని అవ శేషాలను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం సేకరించారు. ఇంట్లోని వస్తువులను కూడా పరిశీలించగా కీలక ఆధారాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. ఊర్వశి మృతి కేసు చాలా సీరియస్‌గా తీసుకున్నామని బారువ ఎస్‌ఐ హరిబాబునాయుడు తెలిపారు. మూడు నెలల కిందటే భర్తను కోల్పోయిన ఊర్వశి ఇద్దరు చిన్న పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది. శుక్రవారం ఆమె ఇంటిలో అనుమానాస్పద స్థితిలో శవమై కని పించింది. తన కూతురుది ఆత్మహత్య కాదని.. అత్తింటి వారే హతమార్చారని ఆమె తండ్రి ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తింటిలో ఉన్న వారిని, అనుమానితులను పోలీసులు విచారిస్తు న్నారు. మృతదేహానికి బారువ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి తండ్రి లోకనాథం ఫిర్యాదు మేరకు ఆస్తి కోసం సమీప బంధువులే ఈ అఘాయ్యితానికి పాల్పడి ఉంటారని అనుమానంతో హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.