Share News

‘పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి’

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:35 PM

గ్రామాల్లో ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కల్లేపల్లిలో పీహెచ్‌సీ వైద్యాధి కారి బి.నమ్రతప్రియ అన్నారు.

‘పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి’
అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

శ్రీకాకుళం రూరల్‌, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కల్లేపల్లిలో పీహెచ్‌సీ వైద్యాధి కారి బి.నమ్రతప్రియ అన్నారు. మలేరియా వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా కళ్లేపల్లిలో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుం డా చూసుకోవాలని, దోమతెరలు వాడాలని సూచించారు. దోమల వల్ల మలేరియా వ్యాప్తి చెందుతుందని, తీవ్ర జ్వరం, చలి, తలనొప్పి, వాంతులు తదితర లక్షణాలతో వ్యక్తి నీరసించిపోతారన్నారు. ఈ లక్షణాలు కనిపిం చిన వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది జి.రవికుమార్‌ , మణిమంజరి, శాం తమ్మ, ఇప్పిలి చిట్టిబాబు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 11:36 PM