పరిశుభ్రంగా ఉంచండి: డీపీవో
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:08 AM
రక్షిత మంచినీటి పథకాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల ని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) భారతీ సౌజన్య అన్నారు.
టెక్కలి, ఫిబ్రవరి25 (ఆంద్రజ్యోతి): రక్షిత మంచినీటి పథకాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల ని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) భారతీ సౌజన్య అన్నారు. బుధవారం టెక్కలిలో పలు రక్షిత నీటి పథకాలను సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించారు. నిరంతరం పర్యవేక్షిస్తూ క్లోరినేషన్ శతశాతం జరిగేలా చూసుకోవాలని ఆదేశించారు. అలాగే ఫ్లోరైడ్ శాతం ఎప్పటికప్పుడు పరిశీలిం చా లని సూచించారు. ప్రతీ హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో వే డి పదార్థాలు కాచిన నీటిని వినియో గదారులకు అందించాలని ఆదేశించా రు. పట్టణంలో కాలువలు మురికి నిల్వప్రాంతాలు కూడా పరిశీలించి అన్నింటా ముందస్తుచర్యలు చేపట్టా లని అన్నారు. ఎక్కడైనా తప్పిదాలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎల్ పీవో ఐవీ రమణ, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ మోహన్, కార్యదర్శి ఏవీ శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు.