పోలీసులకు సవాల్‌గా ‘కాశీబుగ్గ’ చోరీ ఘటన
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:20 AM
కాశీబుగ్గ నిత్యానందనగర్‌లో మంగళవారం మధ్యాహ్నం జ్యూయలరీ షాపులో జరిగిన చోరీ ఘటనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
నాలుగు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా దర్యాప్తు
భయంగుప్పెట్లో బంగారం వ్యాపారులు
పలస, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ నిత్యానందనగర్‌లో మంగళవారం మధ్యాహ్నం జ్యూయలరీ షాపులో జరిగిన చోరీ ఘటనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నిత్యమూ రద్దీగా ఉంటే ప్రాంతంలో పట్టపగలు భారీ స్థా యిలో జరిగిన చోరీ ఘటన పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ ఘటనను ఛేదించేందుకు అన్ని విధాలుగా దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల కోసం నా లుగు బృందాలు ఏర్పాటు చేసి వేట మొదలెట్టారు. ఇంకా భయం గుప్పిట్లోనే పలాస-కాశీబుగ్గ బంగారు వర్తకులు ఉన్నారు. కిల్లంశెట్టి రామకృష్ణారావుకు ఈ ప్రాంతంలో అందరితో పరిచయాలు ఉండడంతో మొత్తం వ్యాపారులంతా ఆయ న కుటుంబానికి సంఘీభావాన్ని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా మధ్యాహ్నం ఆయన షాపులోకి మొత్తం ఎనిమిది మంది దొంగలు ప్రవేశించి తుపాకీ చూపి భయభ్రాంతులు చేసిన అనంతరం చేతికి బేడీలు వేసి మరీ దొంగతనానికి పాల్ప డడం ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించింది. ఉత్తరాంధ్రలోనే ఇటువంటి చోరీ జరగడం ఇదే మొదటి సారి కావడంతో పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకు న్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన ప్రత్యేక పోలీసులతో పాటు విశాఖకు చెందిన క్రైమ్ పోలీసులు కూడా రంగంలోకి దిగి నేరనిర్ధారణ చేశారు. అణువనువు సోదా లు చేస్తూ దొంగల సమాచారాన్ని సేకరిస్తున్నారు. సీసీ ఫ్యూటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే దొంగలు ఎవరనేది ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. పక్కాగా రెక్కి నిర్వహించి చోరీకి పాల్పడిన అనంతరం సులభంగా తప్పించుకోవడంతో పోలీసులు ఆ దిశగా పరిశోధన చేస్తున్నారు. చోరీకి పాల్పడిన వారంతా ఏ ప్రాంతానికి చెందిన వారు? ఇక్కడ వారికి ఆశ్రయం ఎవరైనా ఇచ్చారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు జాగిలాలు కూడా దొంగలు తమ వాహ నాలు పార్కింగ్ చేసిన ప్రదేశం వరకూ వెళ్లివచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
నిశితంగా పరిశీలన
ఈ స్థాయి దొంగతనాలు ఎక్కడైనా ఎక్కువగా రాత్రి పూట జరగడం చూస్తుంటాం. కానీ కాశీబుగ్గ పట్టణంలో మాత్రం పట్టపగలు దోపిడీ చేసి దర్జాగా పరారు కావడంపై వ్యాపారులు భయాందోళన చెందుతున్నారు. నిత్యమూ రద్దీగా ఉండే నిత్యానందనగర్‌లో జరిగిన దొంగతనం పోలీసులకే సవాల్‌గా మారింది. ఇటీవల పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో చిన్నతిరుమల ఆలయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత జిల్లాలో ఉన్న పాత నేరగాళ్లు రెక్కి నిర్వహించి ఆలయంలో విలువైన వెండి, బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేసి పరారయ్యారు. అయితే పోలీసు లు పాత నేరస్తులపై నిఘా పెట్టడంతో వారి బండారం బయట పడింది. చోరీ సొత్తంతా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జరిగిన జ్యూయలరీ షాపు చోరీ భి న్నంగా ఉండడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దీనిని సవాల్‌గా తీసు కొని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. కొద్దిరోజు ల్లోనే కేసును ఛేదిస్తామని పోలీసులు ప్రకటించిన నేపఽఽథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మూడు షాపుల్లో చోరీయత్నం
పలాస, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో మంగళ వారం రాత్రి మొత్తం మూడు షాపుల్లో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. పలాస రైల్వేస్టేషన్ సమీపంలోని రెండు షాపుల్లో చోరీకి ప్రయత్నించారు. కాశీబుగ్గ పట్టణం మేథా స్కూల్ ఎదురుగా పాత జాతీయ రహదారి వద్ద గల మటన్‌షాపులో దొంగలు ప్రవేశించి నగదు అపహరించారు. కాగా వీటిపై బాధి తుల నుంచి ఎటువంటి ఫిర్యాదు పోలీసులకు అందలేదు. వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.