డీజీపీ కార్యాలయానికి కాశీబుగ్గ డీఎస్పీ
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:04 AM
Kashibugga DSP Transfer కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షాబాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు. ఆయనను తక్షణమే విధులు నుంచి రిలీవ్ చేసి, మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హరీష్‌కుమార్ గుప్తా ఆదేశించారు.
హైకోర్టు ఆదేశాలతో నాన్-ఫోకల్ పోస్టుకు బదిలీ
శ్రీకాకుళం, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షాబాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు. ఆయనను తక్షణమే విధులు నుంచి రిలీవ్ చేసి, మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హరీష్‌కుమార్ గుప్తా ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలిపల్లి శ్రీకర్ తదితరులు దాఖలు చేసిన డబ్ల్యూఏ నెం.274/2024 కేసులో విచారణ చేసిన హైకోర్టు.. ఎంపికైన డైరెక్ట్ రిక్రూట్ అభ్యర్థులందరినీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నాన్-ఫోకల్( ప్రాధాన్యత లేని) పోస్టుల్లో నియమించాలని ఈ నెల 11న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు తీర్పు అమలులో భాగంగా బుధవారం సమావేశమైన పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్(పీఈబీ) చేసిన సిఫారసుల మేరకు డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదేశాల ప్రకారం కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షాబాజ్ అహ్మద్‌ను మంగళగిరి హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. వెంటనే ఆయన స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, రిలీవ్ చేయాలని సంబంధిత యూనిట్ అధికారులకు డీజీపీ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.