కార్గిల్ విక్టరీ పార్కు పనులు వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:04 AM
నగరంలోని జడ్పీ కార్యాలయం ఎదు రుగా ఉన్న హౌసింగ్‌బోర్డు కాలనీలోని కార్గిల్ విక్టరీ పార్కు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, జనవరి 28(ఆంధ్రజ్యోతి): నగరంలోని జడ్పీ కార్యాలయం ఎదు రుగా ఉన్న హౌసింగ్‌బోర్డు కాలనీలోని కార్గిల్ విక్టరీ పార్కు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. పనులు జరుగుతున్న తీరును బుధవారం స్వయంగా పరిశీలించారు. ప్రతిఒక్కరూ విని యోగించుకునేలా తీర్చిదిద్దాలన్నారు. పార్కులో నిర్మిస్తున్న రెండు బ్యాడ్మింటన్, పికెల్ బాల్, బాక్స్ క్రికెట్ కోర్టులు క్రీడలకు పూర్తిస్థాయిలో వినియో గమవ్వాలన్నారు. యోగా ప్లాట్‌ఫారం (ఓపెన్ ఎయిర్ థియేటర్)ను యోగాకు లేదా స్ర్కీన్ ద్వారా సినిమా చూసుకునేలా తయారు చేయాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న లైబ్రరీని కూల్చి, కొత్త భవ నాన్ని నిర్మించామ న్నారు. ఆ భవనానికి పక్కనే ధ్యానం చేసుకు నేలా తీర్చిదిద్దాలన్నారు. కార్గిల్ యుద్ధ చరిత్రను తెలియ జేసేలా తీర్చిదిద్దాలని జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజకు సూచించారు. వాటర్ ట్యాంకు వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో చూపించా లని డీఈని ఆదేశించారు. కార్యక్రమంలో సెవెన్‌హిల్స్ అసోసి యేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ, మునిసిపల్ డీఈ, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.