Share News

కార్గిల్‌ పార్క్‌ పనులు పూర్తి చేయాలి

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:33 PM

చిన్నచిన్న మార్పులుచేసి కార్గిల్‌విక్టరీ పార్కు పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు.

కార్గిల్‌ పార్క్‌ పనులు పూర్తి చేయాలి
పార్క్‌లో పనులను పరిశీలిస్తున్న స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌:

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మార్చి 5(ఆంధ్రజ్యోతి): చిన్నచిన్న మార్పులుచేసి కార్గిల్‌విక్టరీ పార్కు పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. గురువారం శ్రీకాకుళంలోని హౌసింగ్‌ బోర్డుకాలనీలోగల కార్గిల్‌విక్టరీ పార్క్‌లో జరుగుతున్న పనులను పరిశీలించా రు. పార్కులో నిర్మిస్తున్న రెండు బ్యాడ్మింటన్‌కోర్టులు, పికెల్‌ బాల్‌కోర్టు, బాక్స్‌ క్రికెట్‌ కోర్టులు పూర్తయినా వాటికి చిన్నచిన్న మార్పులను సూచించారు. యోగా ప్లాట్‌ఫారం ముందుభాగంలో స్ర్కీన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్కులో ఏర్పాటుచేసిన టాయిలెట్‌ కంటైనర్‌ను పరిశీలించారు.వాకింగ్‌ ట్రాక్‌కు పక్కన ఏర్పాటుచేయాల్సిన మొక్కలు, వెనుక భాగంలో కార్గిల్‌ యుద్ధంప్రారంభం నుంచి విజయం సాధించిన తీరును వివరించేచిత్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు అధికారులు వివరించారు. కార్యక్రమంలో సుడా ఈఈ సుగుణాకరరావు, వంశీకృష్ణ, కాలనీఅసోసియేషన్‌ సభ్యులు రామకృష్ణ, కవిత పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 11:33 PM