వైభవంగా కూడారై ఉత్సవం
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:22 PM
ధనుర్మాసం సందర్భంగా నగరంలోని పలు ఆలయాల్లో కూడారై ఉత్స వం ఆదివారం ఘనంగా నిర్వహించారు.
అరసవల్లి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ధనుర్మాసం సందర్భంగా నగరంలోని పలు ఆలయాల్లో కూడారై ఉత్స వం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ బంగ్లా సమీపంలోని కల్యాణ తిరుమల, పాలకొండ రోడ్డులోని కోదండ రామాలయం, పీఎన్ కాలనీ నారాయణ తిరుమలలో ఈ ఉత్సవం నిర్వహించారు. వెండి పాత్రల్లో పాయశం వండి స్వామికి అర్పించారు. కార్యక్రమాల్లో ఆలయ నిర్వాహకులు లోకనాధం నంది కేశ్వర రావు, బెహరా నాగేశ్వరరావు తదిత రులు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని గిలాయివీధిలో ఉన్న వేంక టేశ్వరస్వామి దేవాలయంలో ధను ర్మాస పూజలు ఆదివారం ఘనంగా నిర్వహిం చారు. శ్రీకృష్ణుని విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజా కార్య క్రమాలు చేపట్టారు. తిరుప్పావై పాశుర విన్నపం చేశారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.