Share News

మెళియాపుట్టిలో ‘కల్కి’ దర్శకుడు

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:08 AM

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ నటించిన ‘కల్కి’ సినిమా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ శుక్రవారం మెళియాపుట్టి మండలంలో సందడి చేశారు.

మెళియాపుట్టిలో ‘కల్కి’ దర్శకుడు
ఆలయాన్ని పరిశీలిస్తున్న దర్శకుడు నాగ్‌ అశ్విన్‌

మెళియాపుట్టి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ నటించిన ‘కల్కి’ సినిమా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ శుక్రవారం మెళియాపుట్టి మండలంలో సందడి చేశారు. పట్టుపురం గ్రామంలో ఓ వివాహ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అక్కడి నుంచి ఆయన మెళియాపుట్టి మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి ఆలయ చరిత్రను, విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. నాగ్‌ అశ్విన్‌ను గుర్తించిన అభిమానులు ఆయనతో ఫొటోలు దిగారు. ఆయనతో కరచాలనానికి పోటీ పడ్డారు.

Updated Date - Sep 05 , 2026 | 12:08 AM