Share News

శివారు భూములకు కళింగదళ్‌ నీరు

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:42 AM

శివారు భూములకు కళింగదళ్‌ సాగునీరు అందిస్తామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

శివారు భూములకు కళింగదళ్‌ నీరు
కళింగదళ్‌ నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

  • ఎమ్మెల్యే శిరీష

హరిపురం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): శివారు భూములకు కళింగదళ్‌ సాగునీరు అందిస్తామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మందస మండలం బుడార్సింగి వద్ద కళింగదళ్‌ రిజర్వాయర్‌కు సోమవారం జలహారతిని అందించారు. అనంతరం ఎడమ, కుడి కాలువల నుంచి గేట్లు ఎత్తి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు భావన దుర్యోధన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటికే కాలువలు మరమ్మతులు చేశామని అన్నారు. ప్రతి సెంటు భూమికి నీరంది స్తామని చెప్పారు. అనంత రం రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాసరావు, టీడీపీ నాయ కులు రట్టి లింగరాజు, దాసరి తాతారావు, నవన్‌, తమిరి భాస్కరరావు, సాలిన మాధవరావు, ఈశ్వర్రావు, రమ్ము బెహరా, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాతీయ రహదారి నుంచి కొండలోగాం మీదుగా కిల్లోయి ఎంఎం రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఈ జి.రవికుమార్‌, టీడీపీ నాయకులు సవర లఖియా, లబ్బ రుద్రయ్య, కర్రయ్య, సవర బాలకృష్ణ, భాస్కరరావు పాల్గొన్నారు.

విద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం

వజ్రపుకొత్తూరు, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): విద్య, వైద్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే గౌతుశిరీష అన్నారు. సోమవారం వజ్రపుకొత్తూరు మండలం కంబాలరాయుడిపేటలో రూ. 20 లక్షలతో నిర్మించిన నూతన ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో హెల్త్‌ కేంద్రాల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పుచ్చ ఈశ్వరరావు, మాజీ సర్పంచులు కంబాల దానేసు, గోవింద పాపారావు, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కర్ని రమణ, నాయకులు గుంటు వాసు, సూరాడ రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2026 | 12:42 AM