కళింగ వైశ్యులను బీసీ జాబితాలో చేర్చాలి
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:54 PM
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోగల కళింగ వైశ్యులను బీసీ జాబితాలో చేర్చాలని కళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు కోరారు.
కోటబొమ్మాళి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోగల కళింగ వైశ్యులను బీసీ జాబితాలో చేర్చాలని కళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు కోరారు.ఈమేరకు మంగళవారం విజయవాడలోని టీడీపీ కార్యా లయంలో రాష్ట్ర బీసీ శాఖ మంత్రి ఎస్.సవితకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ గతంలో టీడీపీప్రభుత్వం కొన్ని జిల్లాలోఉన్న కళింగ వైశ్యులను మాత్రమే బీసీ జాబితాలో కలిపిందని, మిగిలిన జిల్లాల కళింగ వైశ్యులను బీసీజాబితాలో కలిపేలోగా ఎన్నికలు వచ్చాయని తెలి పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ కళింగ వైశ్యులను పట్టించుకోలేదని ఆరోపించారు. మిగిలిన జిల్లాల్లో ఉన్న కళింగ వైశ్యులను కూడా బీసీ జాబితాలో కలపాలనిమంత్రికి కోరారు.ఆయనతోపాటు ఎన్టీఆర్ జిల్లా కళింగ వైశ్య సంఘం అధ్యక్షుడు వడ్డివాసు, కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి కొత్తకోట నరసింహ మూర్తి, రాష్ట్ర కళింగకోమటి సాధికారిక సభ్యులు కొత్తకోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.