Share News

ఉత్సాహంగా కబడ్డీ పోటీలు

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:47 PM

ప్రియాగ్రహారంలో వేంచేసి ఉన్న లలిత త్రిపురాంతకవిశ్వేశ్వరస్వామి, లక్ష్మీ చెన్నకేశవస్వామి వార్ల దేవస్ధానంలో మూడురోజుల పాటు నిర్వహించిన డోలోత్సవాలు గురువారంతో ముగిశాయి.

ఉత్సాహంగా కబడ్డీ పోటీలు

  • ప్రియాగ్రహారంలో ముగిసిన డోలోత్సవాలు

పోలాకి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ప్రియాగ్రహారంలో వేంచేసి ఉన్న లలిత త్రిపురాంతకవిశ్వేశ్వరస్వామి, లక్ష్మీ చెన్నకేశవస్వామి వార్ల దేవస్ధానంలో మూడురోజుల పాటు నిర్వహించిన డోలోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఉత్సాహంగా సాగాయి. 33 జట్లు పాల్గొన్నాయి. తెలుగుయువత పార్లమెంటరీ యువ నాయకులు మెండ దాసునాయుడు, నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, జనసేన నాయకుడు ప్రదీప్‌కుమార్‌, మెట్ట వైకుంఠరావు, పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య ఉత్సవాల్లో పాల్గొన్నారు. సర్పంచ్‌ బెవరనూకరాజు, మాజీ సర్పంచ్‌ లావేటి కృష్ణ, ఎంపీటీసీ ప్రసాదరావుల ఆధ్వర్యంలో నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఆలయ పురోహితులు శ్రీనాఽథ్‌శర్మ ఆధ్వర్యంలో పుష్పాలతో ప్రత్యేక పూజలు చేపట్టారు.

Updated Date - Mar 05 , 2026 | 11:47 PM