Share News

బాధితులకు న్యాయం చేయాలి: ఏఎస్పీ

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:12 AM

ప్రజా ఫిర్యాదులు చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని అదనపు ఎస్పీ కేవీ రమణ తెలిపారు.

బాధితులకు న్యాయం చేయాలి: ఏఎస్పీ
: వినతులు పరిశీలిస్తున్న అదనపు ఎస్పీ రమణ

శ్రీకాకుళం క్రైం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదులు చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని అదనపు ఎస్పీ కేవీ రమణ తెలిపారు. ఆయా ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇచ్చి త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. సోమవారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహిం చిన ప్రజా ఫిర్యాదులు స్వీకరణ, పరిష్కార కార్యక్రమంలో అదనపు ఎస్పీ 37మంది ఫిర్యాదుదారులు నుంచి అర్జీలు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడారు.

Updated Date - Jan 13 , 2026 | 12:12 AM