Share News

స్టీల్‌ప్లాంట్‌ బాధితులకు న్యాయం చేయాలి

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:43 PM

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని, కార్మికులకు భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, ఎస్‌.కృష్ణవేణి డిమాండ్‌ చేశారు.

 స్టీల్‌ప్లాంట్‌ బాధితులకు న్యాయం చేయాలి
శ్రీకాకుళంలో నిరసన తెలుపుతున్న కార్మిక సంఘాల నాయకులు:

అరసవల్లి, జూలై 3(ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని, కార్మికులకు భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, ఎస్‌.కృష్ణవేణి డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం లోని అంబేడ్కర్‌ కూడలి వద్ద శుక్రవారం వివిధ కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నా జీరావు, నాయకులు సత్యనారాయణ, వాసుదేవరావు, కొత్తకోట అప్పారావు, ఎల్‌. రామప్పడు, రమణ, జగ్గారావు, పి.జనార్దనరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 11:43 PM