దానయ్య కుటుంబానికి న్యాయం చేయాలి
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:48 PM
దానయ్య మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలాస యాదవ సంఘం అధ్యక్షుడు లొడగల కామేశ్వరరావు యాదవ్ కోరారు.
పలాస, జూలై 20(ఆంధ్రజ్యోతి): దానయ్య మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలాస యాదవ సంఘం అధ్యక్షుడు లొడగల కామేశ్వరరావు యాదవ్ కోరారు. మాజీ మంత్రి అప్పల రాజు కుమారుడు ఆరవ్ వల్ల రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన దుబ్బ దానయ్య భార్య ద్రౌపతికి యాదవసంఘ సభ్యులు రూ.1.25 లక్షల సోమవా రం అందించారు. ఈసందర్భంగా కామేశ్వరరావుయాదవ్ మాట్లాడుతూ దానయ్య మృతితో వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని తెలిపారు. ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో ఇల్లు, రేషన్‌కార్డు, పింఛన్ అందించనున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి అప్పలరాజు వ్యవస్థలను తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరించిన తీరు సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కార్యక్ర మంలో యాదవసంఘం నాయకులు దాసరి తాతారావు, సప్ప నవీన్, కొరా కాన శంకర్, బద్రి గోపాల్, అంబటి కృష్ణమూర్తి, దడియాల నర్సింహులు, గురిటి సూర్యనారాయణ, డొక్కరి శంకర్, అవుగాన షణ్ముఖరావు పాల్గొన్నారు.