Share News

ఎట్టకేలకు విద్యార్థులకు న్యాయం

ABN , Publish Date - Jul 28 , 2026 | 11:53 PM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో ఉన్నతా ధికారుల నిర్వాకంతో ఎటువంటి అనుమతులు లేకుండానే ఎంబీఏలో చేర్చుకున్న ఇద్దరు విద్యార్థుల కు ఎట్టకేలకు న్యా యం జరిగింది.

ఎట్టకేలకు విద్యార్థులకు న్యాయం

రెండో సెమిస్టర్‌ ఫీజుకు అనుమతి

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

ఎచ్చెర్ల రూరల్‌, జూలై 28(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో ఉన్నతా ధికారుల నిర్వాకంతో ఎటువంటి అనుమతులు లేకుండానే ఎంబీఏలో చేర్చుకున్న ఇద్దరు విద్యార్థుల కు ఎట్టకేలకు న్యా యం జరిగింది. స్పాట్‌ అడ్మిషన్లకు ఉన్నత విద్యామండలి నుంచి ఎటువంటి అనుమతులు లేకపోయినా, ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వకపోయినా ఎంబీఏలో ఇద్దరు విద్యార్థులను వర్సిటీ అధికారులు చేర్చుకున్నారు. ఏడాది గడిచింది.. ఆ విద్యార్థులు మొదటి సెమిస్టర్‌ పరీక్షలు రాశారు. రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఆగస్టు 4 నుంచి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండో సెమిస్టర్‌కు ఫీజు కట్టించు కోలేదు.. దీంతో సమస్య బయటకు వచ్చింది. ఈ విషయమై ‘ఆంధ్రజ్యోతి’ లో ఇటీవల ‘ఏడాది తర వాత అడ్మిషన్లు రద్దు’, ‘న్యాయం కోసం’ శీర్షిక లతో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు విద్యార్థులు రెండో సెమిస్టర్‌ అవకాశం కోల్పోయారు. ఈ కథనాలు ఉన్నత విద్యామండలి అధికారుల దృష్టికి వెళ్లాయి. ఏడాది పాటు సదరు విద్యార్థులు క్లాస్‌ వర్కుకు హాజరవడం, మూడో సెమిస్టర్‌ లో ప్రవేశించిన సమయంలో అడ్మిషన్‌ రద్దు అన్నది చట్టపరంగా విద్యా ర్థులు హక్కు హరించడమేనని భావించి వర్సిటీ అధికారులు ఉన్నతాధి కారులను సంప్రదించారు. దీంతో వారు స్పందించి ఇద్దరు విద్యార్థులను అక్రమ ప్రవేశంగా గుర్తించి సెమిస్టర్‌కు రూ.5 వేలు జరిమానా విధించి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అనుమతిచ్చారు. ఈ మేరకు విద్యా ర్థులు పరీక్ష ఫీజే చెల్లించారు. ఆగస్టు 4 నుంచి సెమిస్టర్‌ రాసేందుకు వర్సిటీ అధికారులు హాల్‌టికెట్‌ మంజూరుచేశారు. ఎట్టకేలకు సమస్య పరిష్కా రం కావడంతో సదరు విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రవేశాల సమ యంలోనే ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలను వర్సిటీ అధికారులు సక్రమంగా పాటిస్తే ఈ సమస్య వచ్చి ఉండేది కాదని యూనివర్సిటీలో చర్చ సాగుతోంది.

Updated Date - Jul 28 , 2026 | 11:53 PM