Share News

మధ్యవర్తిత్వంతో ఇరు పార్టీలకు న్యాయం

ABN , Publish Date - Oct 09 , 2026 | 11:46 PM

ఇరుపార్టీల్లో ఎవరికీ నష్టం జరగకుండా మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని ఆరో అదనపు జిల్లా న్యాయాధికారి కోడూరు కిశోర్‌బాబు అన్నారు.

మధ్యవర్తిత్వంతో ఇరు పార్టీలకు న్యాయం

ఆరో అదనపు జిల్లా న్యాయాధికారి కిశోర్‌బాబు

సోంపేట, అక్టోబరు9 (ఆంఽధ్రజ్యోతి): ఇరుపార్టీల్లో ఎవరికీ నష్టం జరగకుండా మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని ఆరో అదనపు జిల్లా న్యాయాధికారి కోడూరు కిశోర్‌బాబు అన్నారు. పలాసపురంలో శుక్రవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యవర్తులకు తమ సమస్యలను ఇరుపార్టీలు తెలియజేస్తే అది న్యాయవాదులకు కాని, న్యాయాధికారులకు కాని తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ విధానా న్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు మడ్డు సర్వేశ్వరరావు, జీఎస్‌ శైలీంద్ర, ఎస్‌ఐ బి.మోహిని తదితరులు పాల్గొన్నారు.

రాజీయే రాజమార్గం: న్యాయాధికారి

జి.సిగడాం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): పెం డింగ్‌లో ఉన్న కేసులను రాజీ ద్వారా పరిష్కరిం చుకోవచ్చని, దీనివల్ల ఇరుపక్షాలకు ప్రయోజనం కలుగుతుందని పొందూరు జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి జ్యోత్స్న అన్నారు. శుక్రవారం ధవళపేటలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెళ్లి, గృహ హింస, చెక్‌ బౌన్స్‌, సివిల్‌ కేసులు, రాజీకి అనుకూలమైన క్రిమినల్‌ కేసులు మధ్య వర్తిత్వం ద్వారా పరిష్కరించు కోవచ్చన్నారు. నవంబరు 21న ప్రత్యేక లోక్‌అదాలత్‌ నిర్వహిస్తు న్నామని, దీనిని సద్వినియోగం చేసుకో వాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కొండపల్లి అప్పల సూరి, న్యాయవాదులు పేడాడ శ్రీరామ్‌, ఎం. రాము, మాజీ సర్పంచ్‌ మహేష్‌

Updated Date - Oct 09 , 2026 | 11:46 PM