Share News

నిర్వాసితులందరికీ న్యాయం: ఎమ్మెల్యే శిరీష

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:50 PM

అర్హత ఉన్న ప్రతి నిర్వాసితుడికీ న్యాయం చేస్తామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష భరోసా ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం స్థానిక టీడీపీ కార్యాలయంలో కాశీబుగ్గ ఆర్వోబీ నిర్వాసితులకు ఇళ్ల పట్టాల ను పంపిణీ చేశారు.

నిర్వాసితులందరికీ న్యాయం: ఎమ్మెల్యే శిరీష
నిర్వాసితులకు పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష:

పలాస, జూలై 14 (ఆంధ్రజ్యోతి): అర్హత ఉన్న ప్రతి నిర్వాసితుడికీ న్యాయం చేస్తామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష భరోసా ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం స్థానిక టీడీపీ కార్యాలయంలో కాశీబుగ్గ ఆర్వోబీ నిర్వాసితులకు ఇళ్ల పట్టాల ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పురుషోత్తపురం సబ్‌డివిజన్‌లో మొత్తం 98 మంది నిర్వాసితులకు ప్రస్తుతం పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. మిగిలిన వారికి త్వరగా ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసం చేపట్టిన ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని న్యాయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అప్పలరాజు, ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పీరుకట్ల విఠల్‌రావు, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి లొడగల కామేశ్వరరావుయాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాస్‌, జిల్లా వాణిజ్యవిభాగం అధ్యక్షుడు టంకాల రవిశంకర్‌గుప్తా, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, బడ్డ నాగరాజు, సప్ప నవీన్‌, ఎం.నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం..

వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం టీడీపీ కార్యాలయంలో పలాస జీడి వ్యాపారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి సంబంధించి జీడి పప్పుపై కూడా ఒక శాతం పన్ను విధానం అమలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దీని ప్రకారం బుధవారంతో ప్రభుత్వం ఇచ్చిన గడువు పూర్తవుతున్నా... ఎటువంటి ప్రకటనా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో స్థానిక పారిశ్రామిక వాడ సముదాయంలో వ్యాపారుల సంఘ అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే శిరీషను కలుసుకొని తమ గోడు వినిపించారు. ఆమె మంత్రి అచ్చెన్నాయుడుతో ఫోన్‌లో మాట్లాడి... వ్యాపారుల సమస్య విన్నవించడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం ఎమ్మెల్యే వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి పన్నుల విధానంపై భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రామేశ్వరరావు విలేకర్లతో మాట్లాడుత తమ సమస్య పరిష్కారం కాకుంటే అవసరమైన పక్షంలో పరిశ్రమలు బంద్‌ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాసరావు, వ్యాపార సంఘ నాయకులు తూముల శ్రీనివాసరావు, కొంచాడ వినయ్‌, తాళాసు శ్రీనివాస్‌, కొత్తకోట తిరుమల, తాళాసు నర్సింహమూర్తి, మల్లా కన్నన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 11:50 PM