‘కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకున్యాయం’
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:45 PM
:కాంగ్రెస్‌తోనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తెలిపారు.
జలుమూరు, జూన్ 8 (ఆంధ్రజ్యోతి):కాంగ్రెస్‌తోనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఘన విజయం సాధించి దేశం, ఆంధ్రప్రదేశ్‌లోను అధికారంలోకి వస్తుందని చెప్పారు. సోమవారం సైరిగాంలో గ్రామస్థులకు సమస్యలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మంత్రి నరసింహమూర్తి, సత్యనారాయణ,వెంకటరమణ పాల్గొన్నారు.