పెళ్లయిన నాలుగు నెలలకే...
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:43 AM
: పెళ్లయి సుమారు నాలుగు నెలలే అయింది. ఇంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో నవ వరుడు మృత్యువాత పడిన ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఒడిశా సరిహద్దులో ఘటన
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పెళ్లయి సుమారు నాలుగు నెలలే అయింది. ఇంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో నవ వరుడు మృత్యువాత పడిన ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది. వివరాలిలా ఉన్నాయి.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం పురుషోత్తపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన పైల నరసింహ (26) అక్కడికక్కడే మృతి చెందాడు. నరసింహ గురువారం రాత్రి ఒడిశా గ్రామం గిరిశోల వెళ్లేందుకు స్కూటీపై బయలుదేరాడు. రాత్రి సమయం కావడంతో రోడ్డుపై గోతులను గుర్తించలేక పోవడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి గోతుల్లో పడి తీవ్ర గాయాలై మృతి చెందాడు. ప్రమాద ప్రదేశం ఒడిశాకు చెందడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి దారితీసిన పరిస్థితు లపై నిర్ధారణ కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా జాతీయరహదారిపై గోతులు ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, సంబం ధిత అధికారులు మర మ్మతులు చే పట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థాని కులు ఆరోపిస్తున్నారు. నరసింహ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుము కున్నాయి. ఇదిలా ఉండగా నరసింహకు మే 3న వివాహమైంది. ఇంతలోనే మృత్యువు వెంటాడింది. తల్లి ్లదండ్రులకు మృతుడు ఒక్కడే కుమారుడు కావడం, తండ్రి కూడా గతంలో మృతి చెందడంతో ఆ కుటుంబ ఆధారం కోల్పోయింది. మృతుడు గ్రామంలోనే కూలి పనిచేసుకుంటూ కుటుం బాన్ని పోషించేవాడు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో భార్య,తల్లిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. విషయం తెల సుకున్న జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.