Share News

ఉద్యోగం వచ్చిన ఐదు నెలలకే..

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:21 PM

ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి.. కుటుంబాన్ని పో షించే స్థాయికి ఎదిగిన కుమారుడు అకాల మరణంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఉద్యోగం వచ్చిన ఐదు నెలలకే..

  • ఛత్తీస్‌గఢ్‌లో వీఎన్‌ పురానికి చెందిన బ్యాంకు ఉద్యోగి మృతి

నరసన్నపేట, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి.. కుటుంబాన్ని పో షించే స్థాయికి ఎదిగిన కుమారుడు అకాల మరణంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నరసన్నపేట మండలం వీఎన్‌ పురం గ్రామానికి చెందిన గుడ్ల వెంకటప్పన్న, కళావతికి ఇద్దరు పిల్లలు కుమారుడు రామ్‌సాయి(27), కుమార్తె తేజ ఉన్నారు. తేజకు పెళ్లి అవ్వగా.. రామ్‌సాయి గత మూడేళ్లుగా బ్యాంకు ఉద్యోగాల కోసం శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో ఐదు నెలల కిందట ఓ ప్రభుత్వ రంగ బ్యాంక్‌లో ఉద్యోగం సాధించాడు. దీంతో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కుంఠి పట్టణంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అక్కడే గోదావరి నదికి స్నానం కోసం వెళ్లి ఈత రాకపోవడంతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో తండ్రి వెంకటప్పన్న బంధువులతో కలిసి చత్తీస్‌గడ్‌ వెళ్లగా.. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లి కళావతి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. అందరితో కలివిడిగా ఉన్న రామ్‌సాయి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మంగళగిరిలో గోపాలపెంట వాసి మృతి

నరసన్నపేట, మార్చి 4(ఆంధ్రజ్యోతి): మండల పరిధి గోపాలపెంట గ్రామానికి చెందిన సనపల బాలకృష్ణ (36) మంగళగిరిలో ఈ నెల 1న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, చికిత్స పొందుతూ చెందినట్టు కుటంబ సభ్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ అదే రోజు రాత్రి మృతిచెందినట్టు తండ్రి మోహనరావు తెలిపారు. ఓ కంపెనీలో పనులు చేస్తున్న సమయంలో గడ్డర్‌ వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడరు. తోటి కార్మికులు మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలిం చగా చికిత్స పొందుతూ మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం బాలకృష్ణ స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - Mar 04 , 2026 | 11:21 PM