కొద్దిసేపట్లో ఇంటికి చేరుతారనగా...
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:04 AM
నందిగాం మండల సరిహద్దు శాసనాం జంక్షన్ సమీప జాతీయ రహదారిపై గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కోమటూరు గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి ఇప్పిలి ప్రసాదరావు(41) మృతిచెందారు.
రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఆర్మీ ఉద్యోగి మృతి
నందిగాం, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): నందిగాం మండల సరిహద్దు శాసనాం జంక్షన్ సమీప జాతీయ రహదారిపై గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కోమటూరు గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి ఇప్పిలి ప్రసాదరావు(41) మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రసాదరావు అలియాస్ షణ్ముఖరావు పనిమీద టెక్కలి వెళ్లి తిరిగి ఇంటికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ప్రసాదరావు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో కోమటూరులో విషాద ఛాయలు అలముకున్నాయి. మరో పది, 15 నిమిషాల్లో ఇంటికి చేరిపోతారనగా ఇలా ప్రమాదంలో మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. భార్య దివ్య, కుమార్తెలు ఊహ, రసిత, కుమారుడు వర్దన్, తల్లిదండ్రులు జనార్దనరావు, జయలక్ష్మిల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నందిగాం ఎస్‌ఐ షేక్‌మహ్మద్ అలీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాదరావు కోమటూరులో కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు.