వివాహమైన 24 రోజులకే..
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:32 AM
కొత్తూరు మండలంలోని పారాపురం గ్రామానికి చెందిన తాడేల తిరుపతిరావు (26) అనే యువకుడు వివాహమైన 24 రోజులకే అనారోగ్యంతో మృతిచెందాడు.
యువకుడి మృతి
పారాపురంలో విషాదం
మెళియాపుట్టి (కొత్తూరు), జూన్ 19(ఆంధ్రజ్యోతి): కొత్తూరు మండలంలోని పారాపురం గ్రామానికి చెందిన తాడేల తిరుపతిరావు (26) అనే యువకుడు వివాహమైన 24 రోజులకే అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మే 26న ఒ డిశాలోని ఓ గ్రామానికి చెందిన యువతితో అతనికి వివాహమైంది. వివా హ మైన కొద్ది రోజులకే అతను పచ్చకామెర్లతో బాధ పడ్డాడు. ఈ మేరకు విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లయి నెల రోజులు తిరగకుండానే తిరు పతిరావు మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.