‘జూడా’ల ఆందోళన బాట
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:27 AM
Demand to resolve issues సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. మంగళవారం ఏపీ జూనియర్ డాక్టర్ల (జూడా) అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్- రిమ్స్) వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు.
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
శ్రీకాకుళం కల్చరల్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. మంగళవారం ఏపీ జూనియర్ డాక్టర్ల (జూడా) అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్- రిమ్స్) వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న జూనియర్ రెసిడెంట్లు, సీనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ పీజీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వైద్యసేవలను నిలిపివేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యవసర వైద్యసేవలు, ఐసీయూ సేవలు కొనసాగించారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సతీష్, మదన్, ప్రసన్న సుదర్శన్, అశోక్, శశితోపాటు పలువురు వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.